AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లో నేనేంటో చూపిస్తా.. టాలీవుడ్ నటుడు..

బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ గురించి చర్చ నడుస్తుంది. తాజాగా టాలీవుడ్ నటుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బిగ్ బాస్ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు. తన బిగ్ బాస్ ఎంట్రీకి ప్రధాన కారణం (దాదాపు 80%) తనేంటో, తన నిజమైన వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఎలాంటిదో ప్రేక్షకులకు చూపించడమే అని తెలిపాడు. సినిమాల్లో సాధారణంగా ప్రతికూల (నైగెటివ్) లేదా విలన్ పాత్రల్లో కనిపించే అతనికి, తెరవెనుక నిజ జీవితంలో తన మనస్తత్వం ఎలా ఉంటుందో బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లో నేనేంటో చూపిస్తా.. టాలీవుడ్ నటుడు..
Temper Vamsi
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2026 | 4:23 PM

Share

నటుడు టెంపర్ వంశీ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రస్థానం, మరిచిపోలేని క్షణాలతో పాటు, బిగ్ బాస్ షోలోకి ఆయన ప్రవేశం గురించి వస్తున్న పుకార్లపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. షో నిర్వాహకులు అడిగిన “బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తున్నారంట నిజమేనా?” అన్న ప్రశ్నకు వంశీ మొదట ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. “ఎవరు చెప్పారు? ఇంకా రాలేదు బయటికి” అని నవ్వుతూ బదులిచ్చారు. ఈ పుకార్లు తరచుగా వస్తుంటాయని, వాటిపై స్పందించాలా వద్దా అనేది తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ షోపై తనకున్న అభిప్రాయాన్ని, అవగాహనను వివరించాల్సిందిగా కోరగా, వంశీ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే, తాను గతంలో బిగ్ బాస్‌ను అంతగా చూడలేదని అన్నారు. నందమూరి తారక రామారావు జూనియర్ గారు హోస్ట్ చేసిన మొదటి సీజన్‌ను లోనావాలాలో చిత్రీకరించినప్పుడు చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దగా చూడకపోయినా, ఈ మధ్య కాలంలో షో గురించి, దాని ప్రభావం గురించి మరింత తెలుసుకుంటున్నట్లు చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

వంశీ దృష్టిలో బిగ్ బాస్ అనేది కేవలం కొందరు కంటెస్టెంట్‌లు మాత్రమే పాల్గొనే షో కాదు. ఆయన లోతైన పరిశీలన ప్రకారం, ఈ షో వెనుక ఒక భారీ పారిశ్రామిక వ్యవస్థ ఉంది. “బిగ్ బాస్ కంటెస్టెంట్‌లకే కాదండి, ఆ దాంట్లో పనిచేసే వాళ్ళు గాని, మీమ్ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు లేదా క్రియేటివ్ సైడ్ గాని, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిపెండ్ దాని మీద” అని వంశీ స్పష్టం చేశారు. అంటే, షో నిర్మాణంలో పాలుపంచుకునే సిబ్బంది, సాంకేతిక నిపుణులు, క్రియేటివ్ టీమ్‌లు, ఆ షో నుండి కంటెంట్ తీసుకుని మీమ్‌లు, విశ్లేషణలు సృష్టించే వారు – ఇలా వేలాది మందికి ఈ షో ఒక జీవనోపాధిని కల్పిస్తోందని ఆయన అన్నారు. బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసినప్పుడు, చాలా మంది ఈ షోపై ఆధారపడి జీవిస్తున్నారని అర్థమైందని వంశీ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

బిగ్ బాస్ షో దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రతి ఇంటికి చేరువైన ఒక అద్భుతమైన వేదిక అని వంశీ అన్నారు. “ఇట్స్ ఏ గుడ్ వన్, అంత మంది బతుకుతున్నారు ఒక దాని మీద అంటే… అది ప్రతి ఇంటికి రీచ్ అయ్యే షో అది. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. ప్రతి ఇండియా అయింది మనకి ప్రతి లాంగ్వేజ్ లో షో అది” అని ఆయన అన్నారు. భారతదేశంలోని అన్ని ప్రధాన భాషల్లో ఏకకాలంలో ప్రసారమవుతూ, ఏకరీతిగా విజయవంతమైన ఏకైక షో బిగ్ బాస్ కావచ్చునని వంశీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులలో బిగ్ బాస్‌కు విశేష ఆదరణ ఉందని, ఇతర భాషల కంటే తెలుగులో వీక్షకుల సంఖ్య గణనీయంగా అధికంగా ఉందని ఆయన చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

టెంపర్ వంశీ..

View this post on Instagram

A post shared by AJHEY 🔱 (@temper_vamsi)

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Follow Us
ఏపీలో వారికి శుభవార్త.. అకౌంట్లోకి రూ.30 వేలు.. రెడీగా ఉండండి..
ఏపీలో వారికి శుభవార్త.. అకౌంట్లోకి రూ.30 వేలు.. రెడీగా ఉండండి..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్