Kamal Haasan: ‘అప్పులన్నీ తీర్చేస్తా.. నచ్చిన ఆహారం తింటా’.. విక్రమ్‌ సినిమా సక్సెస్‌పై కమల్‌ వ్యాఖ్యలు..

|

Jun 14, 2022 | 7:31 PM

Kamal Haasan: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటించిన తాజా చిత్రం విక్రమ్‌ ఏ రేంజ్‌ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన రెండో వారం కూడా కలెక్షన్ల..

Kamal Haasan: అప్పులన్నీ తీర్చేస్తా.. నచ్చిన ఆహారం తింటా.. విక్రమ్‌ సినిమా సక్సెస్‌పై కమల్‌ వ్యాఖ్యలు..
Kamal Haasan
Follow us on

Kamal Haasan: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటించిన తాజా చిత్రం విక్రమ్‌ (Vikram) ఏ రేంజ్‌ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన రెండో వారం కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోందీ సినిమా. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్లా సంచలన విజయం నమోదు చేసుకుందీ చిత్రం. ఒక్క తమిళనాడులోనే రూ. 127 కోట్లు వసూలు చేసి కమల్‌ హాసన్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఇక దేశ వ్యాప్తంగా ఏకంగా రూ. 210 కోట్లను కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్ములేపుతోంది. విదేశాల్లోనూ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్న విక్రమ్‌ ఓవర్‌సీస్‌లోనూ కలెక్షన్ల సునామీ కురిపించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విజయంపై కమల్‌ చాలా సంతోషంగా ఉన్నారు. తాజాగా చెన్నైలో సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న కమల్‌ మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ‘డబ్బు గురంచి చింతించని నాయకుడే ప్రజలకు కావాలి. నేను తక్కువ సమయంలో రూ. 300 కోట్లు సంపాదించగలను అని చెప్పినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు విక్రమ్‌ సినిమాతో ఇది సాధ్యమైంది. ఈ సినిమాతో వచ్చిన లాభాలతో నేను వెంటనే నా అప్పులన్నీ తీర్చేస్తాను. నాకు నచ్చిన ఆహారాన్ని తింటాను. నా స్నేహితులకు, కుటుంబానికి వీలైనంత ఆర్థిక సహాయం చేస్తాను. ఆ తర్వాత నా చేతిలో చిల్లిగవ్వ లేదని తేల్చి చెబుతాను. వేరొకరి దగ్గర డబ్బు తీసుకొని ఇతరులకు సహాయం చేసినట్లు నటించాల్సిన అవసరం నాకు లేదు. నాకు పేరు అవసరం లేదు, మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు కమల్‌.

ఇదిలా ఉంటే విక్రమ్‌ సినిమాను కమల్‌ తన సొంత బ్యానర్‌ అయిన రాజ్‌ కమల్ ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్‌పై తెరకెక్కించిన విషయం తెలిసిందే. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ షాసిల్‌తో పాటు అతిథి పాత్రలో సూర్య నటించిన విషయం తెలిసిందే. సూర్య కనిపించింది కేవలం 5 నిమిషాలే అయినా ఆ పాత్రకు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..