Vijay Deverakonda: విజయ్ తర్వాత మూవీ కథ ఇదేనా.? మునుపెన్నడూ కనిపించని విధంగా రౌడీ హీరో..
ఇక 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2017లో వచ్చిన అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీలో ఓ అలజడి సృష్టించాడు. ఈ సినిమా విజయంతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అర్జున్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసిన విజయ్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోల్లో ఒకరిగా ఓవర్ నైట్‌లో పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో విజయ్ కెరీర్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. అయితే....

విజయ్ దేవరకొండ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2011లో వచ్చిన ‘నువ్విలా’ సినిమాలో చిన్న క్యారెక్టర్‌తో కెరీర్ మొదలు పెట్టిన విజయ్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. అనంతరం లైఫ్ ఇజ్ బ్యూట్ బ్యూటీఫుల్‌లోనూ నటించిమెప్పించాడు. ఇక 2015లో ఎవడే సుబ్రమణ్యం చిత్రంలో ముఖ్య పాత్రలో నటించాడు. ఇందులో విజయ్ పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకుల్లో మాత్రం భారీ ఇంపాక్ట్‌ను చూపించగలిగాడు.
ఇక 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2017లో వచ్చిన అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీలో ఓ అలజడి సృష్టించాడు. ఈ సినిమా విజయంతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అర్జున్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసిన విజయ్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోల్లో ఒకరిగా ఓవర్ నైట్‌లో పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో విజయ్ కెరీర్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. అయితే అనంతరం గీతా గోవిందం, ట్యాక్సీవాలా మినహాయించి విజయ్‌కి ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేవు.
ముఖ్యంగా లైగర్ ఫలితం విజయ్‌కు పెద్ద దెబ్బ లాంటిదనే చెప్పాలి. అయితే తర్వాత వచ్చిన ఖుషీ చిత్రం ప్రేక్షకులను అలరించింది. క్లీన్ లవ్, ఫ్యామిలీ స్టోరీగా వచ్చిన ఈ సినిమా విజయ్‌కి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదనే చెప్పాలి. దీంతో ఈసారి ఎలాగైనా మళ్లీ భారీ విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్న విజయ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా జెర్సీ ఫేమ్.. గౌతమ్ తిన్ననూరితో చేతులు కలిపాడు. ఈ యంగ్ డైరెక్టర్‌తో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు విజయ్.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా ఇంకా హీరోయిన్‌ను కాన్ఫామ్ చేయలేదని చర్చ నడుస్తోంది. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించనున్నట్లు వార్తలు వచ్చాయి, అయితే అనంతరం శ్రీలీలా ఈ సినిమా తప్పుకున్నట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక నటించనుందని తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమా కథకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో విజయ్ ఒక మాఫియా లీడర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్‌గా ఎదిగిన వ్యక్తి కథే ఈ సినిమా అని టాక్ నడుస్తోంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ సినిమాను ప్రస్తుతం VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమా కథ పెద్దగా ఉండడం, సీక్వెల్‌గా తీస్తేనే కథను న్యాయం చేసినట్లు అవుతుందన్న భావనలో దర్శకుడు గౌతమ్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక గౌతమ్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
