Chiranjeevi: రూటు మారుస్తోన్న మెగా స్టార్..? యంగ్ హీరోల బాటలో..
ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లకు సైతం క్రేజ్ పెరిగింది. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్‌లో నటించారు. ఇక బడా నిర్మాణ సంస్థలు సైతం వెబ్‌సిరీస్‌లను రూపొందించడంతో ఓటీటీ మార్కెట్ ఓ రేంజ్‌లో విస్తరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది...
కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లకు వెళ్లే వారు పూర్తిగా తగ్గిపోయారు. ఇంట్లోనే సినిమాలు చూసే రోజులు వచ్చేశాయ్. కొన్ని బడా సినిమాలు సైతం నేరుగా ఓటీటీ వేదికగా సినిమాలను విడుదల చేశాయి. దీంతో ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లకు సైతం క్రేజ్ పెరిగింది. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్‌లో నటించారు. ఇక బడా నిర్మాణ సంస్థలు సైతం వెబ్‌సిరీస్‌లను రూపొందించడంతో ఓటీటీ మార్కెట్ ఓ రేంజ్‌లో విస్తరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ చిరంజీవి లీడ్ రోల్‌లో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం.
ఇటీవల జరిగిన ఓ సంఘటన సైతం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సీఈఓ సారాండోస్ చిరంజీవి హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య వెబ్ సిరీస్‌కు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ఉండడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి చిరు నిజంగానే ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారా లేదా.? అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టిన బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నారు. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కనున్నారని వార్తలు వచ్చాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..