Pooja Hegde: చెల్లి పాత్రలకు సై అంటున్న అందాల తారలు.. మొన్న కీర్తి సురేశ్‌, నేడు పూజా హెగ్డే..

Pooja Hegde: మారుతోన్న కాలానికి అనుగుణంగా హీరోయిన్ల ఆలోచన విధానల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్లు ఐటెం సాంగ్‌లో నటించడం దాదాపు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఎంత ఇమేజ్‌ ఉన్న...

Pooja Hegde: చెల్లి పాత్రలకు సై అంటున్న అందాల తారలు.. మొన్న కీర్తి సురేశ్‌, నేడు పూజా హెగ్డే..

Updated on: May 17, 2022 | 7:47 AM

Pooja Hegde: మారుతోన్న కాలానికి అనుగుణంగా హీరోయిన్ల ఆలోచన విధానల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్లు ఐటెం సాంగ్‌లో నటించడం దాదాపు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఎంత ఇమేజ్‌ ఉన్న హీరోయిన్స్‌ అయినా సరే స్పెషల్‌ సాంగ్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యే పాత్రలకు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తమకంటూ ఓ ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారు. నటనకు ఇంపార్టెన్స్‌ ఉండేలా కానీ చెల్లి పాత్రలో కూడా నటించడానికి వెనుకడుగు వేయడం లేదు. ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచింది నటి కీర్తి సురేశ్‌. ఇటీవల రజనీకాంత్‌ హీరోగా వచ్చిన పెద్దన్న సినిమాలో కీర్తి.. సూపర్ స్టార్‌ చెల్లెలిగా నటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న భళా శంకర్‌ సినిమాలోనూ చిరు చెల్లిగా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ జాబితాలో మరో అందాల తార పూజా హెగ్డే కూడా చేరింది. సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్‌ కూడా నటించనున్నారు. ఫర్హాద్‌ సామ్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలోని విలేపార్లేలో వేసిన ప్రత్యేక సెట్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా కూడా నటిస్తోంది.

అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ చిత్రంలో పూజా హెగ్డే, వెంకీ అన్నాచెల్లెల్లుగా కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్రలకు సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది, వీరిద్దరి అనుబంధం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని టాక్‌. వెంకటేశ్‌ వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే పూజా తాజాగా ఎఫ్‌3 చిత్రంలో వెంకీ, వరుణ్‌లకు జోడిగా స్పెషల్‌ సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..