Virata Parvam: ప్రమోషన్స్‌లో తగ్గేదేలా అంటోన్న విరాట పర్వం టీమ్‌.. ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో ఇద్దరు స్టార్ హీరోలు..

Virata Parvam: రానా (Rana), సాయి పల్లవి (Sai pallavi) జంటగా తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై..

Virata Parvam: ప్రమోషన్స్‌లో తగ్గేదేలా అంటోన్న విరాట పర్వం టీమ్‌.. ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో ఇద్దరు స్టార్ హీరోలు..
Virata Parvam

Edited By:

Updated on: Jun 13, 2022 | 8:28 PM

Virata Parvam: రానా (Rana), సాయి పల్లవి (Sai pallavi) జంటగా తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. ‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఈ చిత్రాన్ని ఓటీటీ (OTT)లో విడుదల చేయనున్నారన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పుకార్లకు చెక్‌ పెడుతూ విరాట పర్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే జూన్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

ఇక కరోనా కారణంగా ఈ సినిమాకు జరగాల్సినంత ప్రచారం జరగని నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. వరుసగా ప్రమోషన్స్‌ ఈవెంట్స్‌ను నిర్వహిస్తూ సినిమాను ఎప్పుడూ లైవ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కర్నూలులో ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తాజాగా జూన్‌ 12న వరంగల్‌లో ఆత్మీయ వేడుకను చేపట్టారు. ఇక తాజాగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో మరో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైందని సమాచారం. సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

జూన్‌ 15న ఈ వేడుకను నిర్వహించునున్నారని సమాచారం. విడుదలకు ముందు జరిగే ఈ చివరి ప్రమోషన్‌ ఈవెంట్‌ కావడంతో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథులుగా వెంకటేష్‌తో పాటు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..