Sudigali sudheer: ‘గాలోడి’ సుడి తిరిగిందిగా.. సుధీర్‌ కోసం క్యూకడుతోన్న అగ్ర నిర్మాతలు.

|

Dec 08, 2022 | 10:59 AM

సుడిగాలి సుధీర్‌.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సుధీర్‌. జబర్దస్త్‌ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సుధీర్‌..

Sudigali sudheer: గాలోడి సుడి తిరిగిందిగా.. సుధీర్‌ కోసం క్యూకడుతోన్న అగ్ర నిర్మాతలు.
Sudigali Sudheer
Follow us on

సుడిగాలి సుధీర్‌.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సుధీర్‌. జబర్దస్త్‌ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సుధీర్‌ కష్టపడి పైకొచ్చిన తీరు ప్రతీ ఒక్కరికీ ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అడపాదడపా వెండి తెరపై నటించినా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. అయితే పట్టు వీడని విక్రమార్కుడల్లే ప్రయత్నిస్తూనే వచ్చాడు సుధీర్‌.

ఈ క్రమంలోనే తాజాగా ‘గాలోడు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సుధీర్‌ భారీ విజయాన్ని అందుకున్నాడు. సినిమా విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకోవడంతో సుధీర్‌కు వరుస ఆఫర్లు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. సధీర్‌తో సినిమా చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు బడా నిర్మాతలు సుధీర్‌ డేట్స్‌ని బుక్‌ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు బడా నిర్మాతలు సుధీర్‌కు అడ్వాన్స్‌ ఇచ్చి మరీ డేట్‌లు లాక్‌ చేసుకున్నారని టాక్‌ నడుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఉంటే మాత్రం సుడిగాలి సుధీర్‌ కెరీర్‌ మరో కీలక మలుపు తిరిగినట్లే. ఈ వార్త తెలిసిన సుధీర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..