Sid Sriram: తన మెస్మరైజింగ్ వాయిస్‌తో యూత్‌ను కట్టిపడేస్తున్నాడు యంగ్ సింగర్ సిద్ శ్రీరామ్. సిద్ ఆలపించిన పాటలను యువత ఎంతో ఇష్టపడి వింటున్నారు. అత్యంత తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సిద్ శ్రీరామ్.. మెలోడియస్ గీతాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. తమిళనాడులో జన్మించి అమెరికాలో పెరిగిన శ్రీరామ్ తెలుగులో తనదైన శైలిలో పాటలు పాడుతూ శ్రోతలను మెస్మరైజ్ చేస్తున్నాడు. ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో మొదలైన సిద్ తెలుగు పాటల ప్రస్థానం.. పుష్ప వరకు కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన అద్భుత గాత్రంతో ఆకట్టుకుంటూ వస్తోన్న సిద్ శ్రీరామ్ ఇప్పుడు కొత్త అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది.
పాటలతో శ్రోతలను కట్టిపడేసిన సిద్ ఇకపై హీరోగా మారి డైలాగ్‌లు, ఫైటింగ్‌తో అట్రాక్ట్ చేయనున్నాడని సమాచారం. మణిరత్నం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్‌ను హీరోగా కూడా ఆయనే లాంచ్ చేయనున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అయితే మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారా.? లేదా నిర్మాతగా వ్యవహరిస్తారా.? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరి సింగర్‌గా అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న సిద్.. హీరోగా ఏమేర రాణిస్తాడో చూడాలి.
Jio Recharge: యూజర్లకు జియో అదిరిపోయే అవకాశం.. ఇకపై రీఛార్జ్ చేసుకోవడం చాలా సులువు..
Lord Hanuman: కుటుంబంలో సుఖసంతోషాలు లేవా.. అయితే పితృదేవతలను ఇలా పూజించండి..