Rajamouli Mahesh: హిట్ పెయిర్‌ను మరోసారి కలిపేందుకు జక్కన్న ప్లాన్.. మహేష్ సరసన నటించబోయేది ఎవరో తెలుసా?
Rajamouli Mahesh: మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు సంబంధించిన వార్త ఇలా వచ్చిందో లేదో.. ఫ్యాన్స్‌లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి వస్తోన్న వార్తలకు అధికారిక..
Rajamouli Mahesh: మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు సంబంధించిన వార్త ఇలా వచ్చిందో లేదో.. ఫ్యాన్స్‌లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి వస్తోన్న వార్తలకు అధికారిక ప్రకటన రాగానే మహేష్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటి వరకు తెలుగులో రాని కథాంశంతో తెరకెక్కించనున్నారన్న వార్తలు కూడా క్యూరియాసిటీని మరింతగా పెంచేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా పూర్తికాగానే మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సినిమాపై వర్కవుట్ ప్రారంభించనున్నాడు. అంటే వచ్చే ఏడాది జనవరి తర్వాత ఈ సినిమాపై ఫుల్ క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే ఇంకా టైటిల్ కూడా ప్రకటించని ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట్ వైరల్ అవుతోంది. తాజాగా చక్కర్లు కొడుతోన్న ఓ వార్త ప్రకారం.. మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఇప్పటి వరకు మహేష్‌తో కలిసి దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. వీటిలో బ్రహ్మోత్సవం రిజల్ట్ కాస్త అటు ఇటుగా వచ్చినా మిగతా రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. దీంతో ఈ లక్కీ పెయిర్‌ను మరోసారి కలిపేందుకు జక్కన్న ప్లా్‌న్ వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.