Priyanka Gandhi: యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం.. మాకు ఆ సత్తా ఉంది.. స్పష్టం చేసిన ప్రియాంక..
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో కలవమని,
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో కలవమని, ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా తమకుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రస్ పార్టీ ఆదివారం బులంద్ షహర్‌లో ‘ ప్రతిజ్ఞ- సమ్మేళన్ లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పలు పార్టీలతో పొత్తు పెట్టుకుంటోందన్న ఊహాగానాలకు ప్రియాంక తెరదించారు. ‘ ఇతర పార్టీలతో పొత్తులు వద్దని, ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుదామని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. మేం వారి అభిప్రాయాలను గౌరవిస్తాం. అందుకే యూపీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలనే ఎంపిక చేస్తాం. కాంగ్రెస్ గెలవాలనుకుంటే ఒంటరిగానే గెలుస్తుంది’ అని ప్రియాంక స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక బరిలో నిలుస్తారని, ఆమె నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల ప్రియాంక ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. విమాన ప్రయాణంలో ఒకరికొకరు తారసపడిన ఇద్దరూ కాసేపు రాజకీయాలపై చర్చించుకున్నారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మాతృమూర్తి కన్నుమూశారు. దీంతో ప్రియాంక స్వయంగా వెళ్లి మాయావతిని పరామర్శించారు. దీంతో కాంగ్రెస్ ఎస్పీ లేదా బీఎస్పీలతో పోత్తు పెట్టుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే తాజా ప్రకటనతో అవన్నీ ఊహాగానాలేనని ప్రియాంక స్పష్టం చేశారు.
Also Read: