AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మునుపెన్నడూ కనిపించని పాత్రలో డార్లింగ్ ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి స్పిరిట్‌ కోసం ఇలా..

Prabhas: బాహుబలితో ఒక్కసారిగా పాన్‌ ఇండియా హీరోగా మారారు ప్రభాస్‌. ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్‌ హీరోగా ఎదిగారు. ప్రభాస్‌ చేస్తోన్న తాజా చిత్రాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌...

Prabhas: మునుపెన్నడూ కనిపించని పాత్రలో డార్లింగ్ ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి స్పిరిట్‌ కోసం ఇలా..
Narender Vaitla
|

Updated on: Jan 04, 2022 | 7:33 PM

Share

Prabhas: బాహుబలితో ఒక్కసారిగా పాన్‌ ఇండియా హీరోగా మారారు ప్రభాస్‌. ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్‌ హీరోగా ఎదిగారు. ప్రభాస్‌ చేస్తోన్న తాజా చిత్రాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ నుంచి సినిమా వస్తుందంటే అది ఇండియా లెవల్‌లో పెద్ద వార్తగా మారుతోంది. సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్‌ అవుతోంది. ఇక సాహో విడుదలై రెండేళ్లు గడుస్తోన్నా ప్రభాస్‌ నుంచి మరో సినిమా రాకవపోవడంతో ఆయన ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అభిమానుల వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈ సంక్రాంతికి రాధేశ్యామ్‌ విడుదలకానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించిన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ కొత్త చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్‌ రెడ్డి మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కేవలం ఇండియన్‌ లాంగ్వేజెస్‌కి మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాల భాషల్లోనూ విడుదలవుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది.

నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం ప్రకారం స్పిరిట్‌ చిత్రంలో ప్రభాస్‌ ఒక పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ గతంలో ఎన్నడూ పోలీస్‌ పాత్రలో నటించలేదు. అయితే తొలిసారి ప్రభాస్‌ను పోలీస్‌ పాత్రలో చూపించడానికి సందీప్‌ సిద్ధమవుతున్నాడని జోరుగా చర్చ నడుస్తోంది. మరి ఈ వార్తలో నిజంగా నిజం ఉందా.. లేదా గాసిప్‌ రాయుళ్ల నుంచి పుట్టుకొచ్చిన మరో గాసిప్‌ వార్తేనా తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read: PM Modi: త్రిపుర ప్రజలకు మూడు వరాలు ప్రకటించిన ప్రధాని.. పేదరికం, వెనుకబాటుతనానికి త్వరలో విముక్తిః మోడీ

UP Election 2022: ఐదు మాసాల్లో సీఎం యోగీ 100 పర్యటనలు.. యూపీ ఎన్నికల్లో ‘ఉపయోగి’ అవుతాయా?

Sreeleela: ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది.. కుర్ర హీరోయిన్ భారీ ఆశలు..