Sree Leela: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ‘పెళ్లి సందD’ బ్యూటీ.. ఏకంగా సూపర్‌ స్టార్‌ సినిమాలోనే..

|

Feb 08, 2022 | 8:11 AM

Sree Leela: 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార శ్రీలీల. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. తన అందంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది, ఒక్క సినిమాతోనే..

Sree Leela: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన పెళ్లి సందD బ్యూటీ.. ఏకంగా సూపర్‌ స్టార్‌ సినిమాలోనే..
Follow us on

Sree Leela: ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార శ్రీలీల. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. తన అందంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది, ఒక్క సినిమాతోనే పది సినిమాల ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో సోషల్‌ మీడియాలో (Social Media) శ్రీలీలకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. కేవలం సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ మాత్రమే కాకుండా సినిమా ఆఫర్లు కూడా క్యూకట్టాయి.  ఒకేసారి ఆరు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటే ఈ అమ్మడికి ఎలాంటి క్రేజ్‌ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ధమాకాతో పాటు , నవీన్‌ పొలిశెట్టి హీరోగా తెరకెక్కుతోన్న అనగనగా ఒక రాజు సినిమాలో శ్రీలీల నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే శ్రీలీల తాజాగా మరో భారీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏకంగా మహేస్‌ బాబుతో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోవడానికి చిత్ర యూనిట్‌ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. శ్రీలీల స్పీడ్‌ చూస్తుంటే తక్కువ సమయంలోనే టాప్‌ హీరోయిన్‌ల జాబితాలో చేరేలా కనిపిస్తోంది కదూ. ఇక రామనాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమం జరుపుకున్న మహేష్‌, త్రివిక్రమ్‌ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Also Read: Job Mela: నేడు హైదరాబాద్‌లో మెగా జాబ్‌ మేళా.. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న వారికి కూడా ఛాన్స్‌..

Statue of Equality: వైభవంగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు.. భక్తి పారవశ్యంలో 6వ రోజు వేడుకలు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..