AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ఇది కదా తలైవా రేంజ్‌ అంటే.. రజినీ తాజా సినిమా రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక ఇబ్బంది పడ్డ రజనీ.. జైలర్‌ మూవీతో మళ్లీ గాడిలో పడ్డారు. ఈ సినిమా విజయంతో రజినీ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. బాక్సాఫీస్‌ వద్ద ఊహించిన విజయం అందుకున్న జైలర్‌ మూవీ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా విజయంతో రజినీ మరోసారి సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కారు...

Rajinikanth: ఇది కదా తలైవా రేంజ్‌ అంటే.. రజినీ తాజా సినిమా రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే.
Rajinikanth
Narender Vaitla
|

Updated on: Nov 06, 2023 | 6:27 PM

Share

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌.. ఈ పేరును సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. చరిత్రలో మరిచిపోలేని ఎన్నో సినిమాల్లో నటించిన రజినీ భారత దేశంలోనే టాప్ హీరోల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక ఇబ్బంది పడ్డ రజనీ.. జైలర్‌ మూవీతో మళ్లీ గాడిలో పడ్డారు. ఈ సినిమా విజయంతో రజినీ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. బాక్సాఫీస్‌ వద్ద ఊహించిన విజయం అందుకున్న జైలర్‌ మూవీ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా విజయంతో రజినీ మరోసారి సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కారు.

ఈ క్రమంలోనే రజినీకాంత్ ప్రస్తుతం తలైవా 171 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేషన్‌ కనకరాజన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల వరుస విజయాలను అందుకున్న కనకరాజన్‌ దర్శకత్వం వహిస్తుండబంతో తలైవా 171 కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని రజినీ ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తివకరమైన వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అదే రజీనీకాంత్‌ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌.

ఈ సినిమా కోసం రజినీకాంత్‌ ఏకంగా రూ. 260 నుంచి రూ. 280 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారనే టాక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వార్తే నిజమైతే ఆసియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న నటుడిగా రజినీ అరుదైన రికార్డును సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. జైలర్‌ మూవీతో రజినీ మార్కెట్ రేంజ్‌ ఏంటో మరోసారి స్పష్టం కావడంతో నిర్మాతలు ఈ రెమ్యునరేషన్‌ను ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. విక్రమ్‌, లియో మూవీస్‌లను మించి ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు లోకేషన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే గతంలో కూడా రజినీ జాకీ చాన్‌ కంటే అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకొని అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. ఇక జైలర్ చిత్రానికి కూడా రజనీ ఏకంగా రూ. 200 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకున్న హీరోగా నిలిచారు రజినీ. ఇప్పుడు అంతకు మించి ఏకంగా రూ. 280 కోట్లు తీసుకోనున్నారన్న వార్త వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండ..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!