Shaakuntalam: భారీ మొత్తానికి అమ్ముడు పోయిన శాకుంతలం ఓటీటీ హక్కులు.. స్ట్రీమింగ్ పాట్నర్ ఎవరో తెలుసా.?

|

Jan 23, 2023 | 6:38 PM

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ దృష్టి పడింది. ఎలాగైనా ఈ సినిమా విజయంతో మళ్లీ పట్టాలెక్కాలని..

Shaakuntalam: భారీ మొత్తానికి అమ్ముడు పోయిన శాకుంతలం ఓటీటీ హక్కులు.. స్ట్రీమింగ్ పాట్నర్ ఎవరో తెలుసా.?
Shakunthalam Ott
Follow us on

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ దృష్టి పడింది. ఎలాగైనా ఈ సినిమా విజయంతో మళ్లీ పట్టాలెక్కాలని చూస్తున్నాడు గుణ శేఖర్‌. దీంతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకు అనుగుణంగానే శాకుంతాలాన్ని దృశ్య కావ్యంగా రూపొందించాడు. ఇక దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం తుది మెరుగులు దిద్ది పనిలో ఉన్నారు మేకర్స్‌.

ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసి ట్రైలర్‌ సైతం అంచనాలు పెంచేసింది. మహా కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దుష్యంత రాజు, శకుంతల ప్రేమ కథ చుట్టూ ఈ చిత్ర కథ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఫిబ్రవరి 17న ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 3డిలో విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా విడుదల 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..