కూర్చొని కాదు పడుకొని భోజనం చేస్తున్నా: నెటిజన్‌కి అభిషేక్ రిప్లై

కరోనా బారిన పడ్డ  అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తమ ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సమాచారాన్ని అందిస్తున్నారు వీరిద్దరు.

  • Tv9 Telugu
  • Publish Date - 11:07 am, Fri, 31 July 20
కూర్చొని కాదు పడుకొని భోజనం చేస్తున్నా: నెటిజన్‌కి అభిషేక్ రిప్లై

Abhishek Bachchan reply to troll: కరోనా బారిన పడ్డ  అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తమ ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సమాచారాన్ని అందిస్తున్నారు వీరిద్దరు. అయితే కొంతమంది నెటిజన్లు రెచ్చిపోతూ వీరిని కించపరుస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ నెటిజన్‌.. అమితాబ్‌ కరోనాతో చచ్చిపోతాడంటూ‌ కామెంట్ పెట్టాడు. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బీ, అతడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా అభిషేక్‌ని ఉద్దేశించి మహిళ ఫొటో, పేరు పెట్టుకున్న ఓ నెటిజన్‌ రెచ్చిపోయారు.

”మీ నాన్న ఆసుపత్రిలో ఉన్నాడు కదా. మరి ఎవరి భరోసాతో కూర్చొని తింటున్నావు..?” అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించారు. దానికి అభిషేక్ స్పందిస్తూ.. ‌’ప్రస్తుతానికి కూర్చొని కాదు. పడుకుని భోజనం చేస్తున్నా. మా నాన్న కూడా నాతోనే ఆసుపత్రిలో ఉన్నారు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఆ తరువాత ఆ నెటిజన్‌ ”త్వరగా కోలుకోండి సర్‌. ఎవరి రాత‌ ఎలా ఉందో ఎవరూ చెప్పలేరు” అంటూ కామెంట్‌ పెట్టగా.. ”మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను ప్రార్థిస్తున్నా. మీ విషెస్‌కి ధన్యవాదాలు” అని అభిషేక్‌ కూల్‌గా సమాధానం ఇచ్చారు. కాగా గతంలోనూ పలుమార్లు అభిషేక్‌ని ఉద్దేశించి నెటిజన్లు ట్రోల్ చేశారు. వాటన్నింటికి ఈ హీరో కూల్‌గా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు.

Read This Story Also: సుశాంత్‌ విషయంలో దయచేసి ఆ పదాలు వాడకండి: అంకితా లోక్వాండే

https://twitter.com/ParulGang/status/1288488565848985601