5

ప్రొడ్యూసర్లతో పేచీ.. శింబు చుట్టూ ఉచ్చు

ప్రముఖ తమిళ సినీ నటుడు శింబు మరో వివాదంలో చిక్కుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకున్న సినిమా షూటింగ్‌లకు హాజరు కావడంలేదని శింబుపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. ‘ట్రిపుల్‌ ఎ’ రెండోపార్ట్‌ షూటింగ్‌కు సహకరించడంలేదని నిర్మాత ఆరోపిస్తున్నారు. నిర్మాతల కౌన్సిల్‌ను మీనాక్షి, జ్ఞానవేల్‌ రాజా ఆశ్రయించారు. శింబుపై ఐదుగురు నిర్మాతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ ప్రారంభించినట్లు తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. శింబు ప్రధాన పాత్ర […]

ప్రొడ్యూసర్లతో పేచీ.. శింబు చుట్టూ ఉచ్చు
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 11:18 AM

ప్రముఖ తమిళ సినీ నటుడు శింబు మరో వివాదంలో చిక్కుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకున్న సినిమా షూటింగ్‌లకు హాజరు కావడంలేదని శింబుపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. ‘ట్రిపుల్‌ ఎ’ రెండోపార్ట్‌ షూటింగ్‌కు సహకరించడంలేదని నిర్మాత ఆరోపిస్తున్నారు. నిర్మాతల కౌన్సిల్‌ను మీనాక్షి, జ్ఞానవేల్‌ రాజా ఆశ్రయించారు. శింబుపై ఐదుగురు నిర్మాతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ ప్రారంభించినట్లు తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. శింబు ప్రధాన పాత్ర పోషించిన “అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌” చిత్రంతో తనకు రూ.20 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ ఆరోపించారు. ఆ చిత్రం సెకండ్ పార్ట్ తీయడానికి శింబు అంగీకరించలేదన్నారు. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చేసిన ఫిర్యాదులో.. శింబు హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని, షూటింగ్‌ పనులు ప్రారంభమైనప్పటికీ ఆయన సహకరించక పోవడంతో ఆ చిత్రం షూటింగ్‌ ఆగిపోయిందన్నారు. ఎస్కేప్‌ ఆర్ట్స్‌కు చెందిన నిర్మాత మదన్‌ చేసిన ఫిర్యాదులో.. తన చిత్రంలోనూ శింబును నటింపజేయడానికి ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందం జరిగి రోజులు గడుస్తున్నా ఆయన షూటింగ్‌కు సహకరించని కారణంగా తీవ్రనష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు.

అయితే ఇదే తరహాలో తాను కూడా మోసపోయినట్లు గొరిల్లా చిత్ర నిర్మాత సురేష్‌ ఫిర్యాదు చేశారు. సురేష్‌ కామాక్షి అనే మరో నిర్మాత కూడా శింబు నాయకుడిగా తాను నిర్మించతలపెట్టిన “మానాడు” చిత్రం షూటింగ్‌ అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. ఈ కోవలో ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండడంతో నిర్మాతల మండలి చర్యలకు ఉపక్రమించింది. నష్టపోయిన నిర్మాతలను ఆదుకునేందుకు నిర్మాతల మండలి ఆరుగురు సభ్యులతో కమిటీ వేసింది. ఈ ఆరోపణలు నిజం అని తేలితే.. శింబు చేత సంబంధిత నిర్మాతలకు నష్ట పరిహారం ఇప్పించడం, ఆయనపై చర్యలు తీసుకోవడం జరిగే అవకాశం ఉందని నిర్మాతల మండలి తెలిపింది.

శ్రీవల్లీ సైలెంట్ అవ్వలేదు.. ఈసారి మరింత క్రేజీగానేషనల్ క్రష్..!
శ్రీవల్లీ సైలెంట్ అవ్వలేదు.. ఈసారి మరింత క్రేజీగానేషనల్ క్రష్..!
నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్