
Sekhar Kammula Dhanush Movie: సాఫ్ట్ మూవీస్‌తో మంచి కాఫీ లాంటి సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, తమిళ హీరో ధనుష్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చిన రోజు నుంచే చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. తన విలక్షణ నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ధనుష్ ఓ తెలుగు దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పడం, అందులోనూ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి బయటకు వస్తోన్న ఏ చిన్న అప్‌డేట్ అయినా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. మద్రాస్ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్న రోజుల్లో జరిగే నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందనేది సదరు వార్త సారంశం. ఇక రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా అని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి అప్పట్లో వాస్తవంగా జరిగిన సన్నివేశాల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారా.? లేదా కాల్పనిక కథను జోడిస్తారా అన్న విషయం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో మొదలు కానుంది. నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ధనుష్ ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు, ఇక శేఖర్ కమ్ముల నాగ చైతన్య హీరోగా ‘లవ్‌స్టోరీ’ అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా నిర్మాణం పూర్తికాగానే కొత్త చిత్రం ప్రారంభంకానుంది.
Also Read: Rashmika Mandanna -Rashi Khanna: ఇద్దరూ ఇద్దరే.. కుర్రాళ్ళ గుండెలకు గాలాలు వేస్తున్న వయ్యారాలు..
SR Kalyana Mandapam: భారీ వసూళ్లను రాబడుతోన్న ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’.. మొదటి రోజు ఎంతంటే..
‘అరె భాయ్..! నా పేరిట 20 శాతం డిస్కౌంట్ ఇవ్వు.. చెప్పులమ్మే సెల్లర్ తో సోను సూద్ ‘బేరం’ !