West Bengal Election 2021 Opinion Poll LIVE: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ వెర్సస్ తృణమూల్ కాంగ్రెస్.. గెలుపెవరిది.!
West Bengal Assembly Elections: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఏయే పార్టీలకు విజయావకాశాలు..

West Bengal Assembly Elections: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఏయే పార్టీలకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.? ఏ పార్టీ విజయం సాధిస్తుంది.? ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి.? అక్కడి అధికారపక్షం మరోసారి పీఠాన్ని దక్కించుకుంటుందా? లేదా విపక్షాలు విజయం సాధిస్తాయా.? అనేది ఇప్పుడు చర్చ. ఇదిలా ఉంటే ముఖ్యంగా బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వైపు అందరి దృష్టి పడింది. రెండు సార్లు అధికారంలో కొనసాగిన తృణమూల్ మరోసారి పీఠాన్ని దక్కించుకుంటుందా? లేదా బీజేపీ గెలుస్తుందా.? అన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
LIVE NEWS & UPDATES
-
బెంగాల్‌లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీవీ9 అభిప్రాయ సేకరణలో టీఎంసీ పార్టీ గరిష్ట ఓట్లు దక్కించుకుంటుందని తేలింది. ఇందులో టీఎంసీకి 43.1 శాతం ఓట్లు రావచ్చునని… అదే సమయంలో, బీజేపీ 38.8 శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉంటుందని ప్రజలు తేల్చారు.
Bengal Vote Share
-
నందిగ్రామ్‌లో దీదీ వైపే ఓటర్ల మొగ్గు…
బెంగాల్ అంతా ఒకెత్తు అయితే.. నందిగ్రామ్ ఒకెత్తు అని చెప్పవచ్చు. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మమత స్వయంగా పోటీ చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీదీ స్వయంగా బరిలోకి దిగడంతో నందిగ్రామ్ సెగ్మెంటు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. అయితే నందిగ్రామ్ నుంచి దీదీ స్వయంగా బరిలోకి దిగడం వెనుక ప్రధాన కారణం అక్కడ్నించి ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంటేనని బెంగాల్ మీడియా కథనాలు రాస్తోంది. ఈ తరుణంలో తాజాగా దీదీపై అక్కడ జరిగిన ఎటాక్ కూడా తృణమూల్ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశంలా కనిపిస్తోంది. ఇక ఓపినియన్ పోల్స్‌లో కూడా అదే తేలింది. దాదాపు 50 శాతం మంది నందిగ్రామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని అభిప్రాయపడగా.. బీజేపీ విజయం సాధిస్తుందని 40.7 శాతం మంది, 9.3 శాతం మంది విపక్షాలు గెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు.
Nandigram
-
-
దీదీతోనే అభివృద్ధి…
మరోసారి బెంగాలీ ప్రజలు దీదీ వైపే మొగ్గు చూపేలా కనిపిస్తున్నారు. తాజాగా టీవీ9 నిర్వహించిన ఓపినియన్ పోల్స్‌లో కూడా అదే తేలింది. 51.1 శాతం మంది తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకోగా.. బీజేపీకి 38.6 శాతం, లెఫ్ట్ పార్టీలకు 7.5 శాతం, కాంగ్రెస్‌కు 1.1 శాతం మంది ఓటేశారు.
Bengal Development
-
ప్రధాని మోదీ చరిష్మా… దీదీ హవా…
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో.? ఏ పార్టీ ఓడుతుందో.? అన్న విషయాలను కాసేపు పక్కన పెడితే.. ప్రతీ ఎన్నికల్లోనూ బీజేపీకి నరేంద్ర మోదీ చరిష్మా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి బెంగాల్ ఎన్నికలకు కూడా అదే జరుగుతుందని బీజేపీ పార్టీ జాతీయ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సర్వే పూర్తిగా రివర్స్ అయింది. మోదీ చరిష్మా కంటే.. దీదీ హవానే బెంగాల్‌లో కొనసాగుతుందని తేలింది. 28.6 శాతం మంది బెంగాల్ ఎన్నికల్లో మోదీ చరిష్మాపై ఓటు వేయగా.. మమతా బెనర్జీ హవా మరోసారి కొనసాగుతుందని 39.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ముస్లిం ఫ్యాక్టర్‌కు 6.3 శాతం మంది, ఔట్‌సైడర్ ఫ్యాక్టర్‌కు 4.8 శాతం మంది, కరప్షన్ ఇష్యూపై 14.4 శాతం మంది, లా అండ్ ఆర్డర్‌పై 6.3 శాతం మంది ఓటేశారు.
Factor
-
ఆ దాడి దీదీకి కలిసొచ్చిందా..
నందిగ్రామ్‌లో దీదీపై జరిగిన దాడి ఘటన ప్రభావం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అది తృణమూల్ కాంగ్రెస్ గెలుపోటములపై పడే అవకాశం కూడా ఉందని వారి వాదన. ఈ నేపధ్యంలో నందిగ్రామ్ దాడి ఘటన కారణంగా తృణమూల్ కాంగ్రెస్‌కు లబ్ది చేకూరనుందని 47 శాతం మంది అంటుంటే.. దాని వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని 41.7% మంది.. ఆ ఘటన తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం పడుతుందో.? లేదో.? చెప్పలేమని 11.30% ప్రజలు అంటున్నారు.
Mamata Banerjee Injury 1
-
-
Bengal Assembly Elections: ఎవరు బెస్ట్ సీఎం…
హేమాహేమీల లాంటి రాజకీయ నాయకులు ఎందరో ఉన్నా.. బెంగాల్ ప్రజలు మాత్రం మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే అధిక శాతంలో ఓటేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా దీదీ ప్రభుత్వం ఎన్నో రకాల పధకాలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీనే బెస్ట్ సీఎం అంటూ ఆయన పనితీరును మెచ్చుకుని 51.8 శాతం ప్రజలు ఓటేయగా.. బీజేపీ నేత దిలీప్ గోష్‌కు 24.1%, మరో కమలం పార్టీ నేత శుభెండు అధికారికి 5.2%, అలాగే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ముఖ్యమంత్రి కావాలని 7.9 శాతం మంది, బాలీవుడ్ సీనియర్ హీరో, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి 4.6 శాతం ఓట్లు, కాంగ్రెస్ నేత అదిర్ రంజన్ చౌదరీకి 2.2% ఓట్లు, ఇతరులకు 4.1 శాతం ఓట్లు పడ్డాయి.
Cm Face Bengal 1
-
టీవీ 9 భారత్‌వర్ష, పోల్‌స్ట్రేట్ సంయుక్తంగా ఓపినియన్ పోల్ నిర్వహించాయి..
టీవీ 9 భారత్‌వర్ష, పోల్‌స్ట్రేట్ సంయుక్తంగా కలిసి ఈ ఓపినియన్ పోల్ నిర్వహించాయి. మార్చి 12-15 మధ్య 10,000 మంది ఓటర్లతో మాట్లాడి.. వారి అభిప్రాయాలను సేకరించారు. పోల్‌లో కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
పోల్ ప్రశ్నలు ఇలా ఉన్నాయి…
1. ఏ ఇష్యూ ఎన్నికలలో గేమ్ ఛేంజర్ 2. నందిగ్రామ్‌లో ఎవరు గెలుస్తారు 3. నందిగ్రామ్ ఘటన మమతా బెనర్జీకి ప్రయోజనం చేకూరుస్తుందా.? 4.సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు.? 5. ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
-
బెంగాల్ ఎన్నికలు.. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు..
బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వైపు అందరి దృష్టి పడింది. రెండు సార్లు అధికారంలో కొనసాగిన తృణమూల్ మరోసారి పీఠాన్ని దక్కించుకుంటుందా? లేదా బీజేపీ గెలుస్తుందా.? అన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది.
-
157 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు 157 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారం ప్రకటించింది. ఇతర పార్టీలకు చెందిన 22 మంది నాయకులకు టికెట్ ఇవ్వడానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నారు.
Published On - Mar 19,2021 6:27 PM




