AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Election 2021: రాజ్యసభ సభ్యత్వానికి స్వపన్ దాస్ గుప్తా రాజీనామా.. టికెట్ కేటాయించిన బీజేపీ

Swapan Dasgupta: రాజ్యసభ సభ్యత్వానికి స్వపన్ దాస్‌గుప్తా రాజీనామా చేశారు. తన రాజ్యసభ్య ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం మధ్యాహ్నం స్వపన్ దాస్‌గుప్తా..

West Bengal Election 2021: రాజ్యసభ సభ్యత్వానికి స్వపన్ దాస్ గుప్తా రాజీనామా.. టికెట్ కేటాయించిన బీజేపీ
Swapan Dasgupta Resigns As Rajya Sabha Mp
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2021 | 3:21 PM

Share

Swapan Dasgupta: రాజ్యసభ సభ్యత్వానికి స్వపన్ దాస్‌గుప్తా రాజీనామా చేశారు. తన రాజ్యసభ్య ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం మధ్యాహ్నం స్వపన్ దాస్‌గుప్తా ట్విట్ చేసి వెల్లడించారు. త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ.. స్వపన్ దాస్‌ గుప్తాకు తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కేటాయించింది. దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో దాస్‌గుప్తా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు పంపించినట్లు వెల్లడించారు. మెరుగైన బెంగాల్ పోరాటంలో పూర్తిగా పాల్గొనేందుకు తాను ఈ రోజు రాజ్యసభకు రాజీనామా చేసినట్లు స్వపన్ దాస్ గుప్తా ట్విట్‌లో వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో తారకేశ్వర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

కాగా.. ఆయన నామినేషన్‌పై రాష్ట్రంలో హైడ్రామా నడిచింది. స్వపన్ దాస్‌గుప్తాను రాజ్యసభకు అనర్హుడిగా ప్రకటించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఆయన పోటీ చేస్తున్నందున, ఆయన రాజ్యసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ చైర్మన్‌ను కోరింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్లమెంటులో కొనసాగేందుకు ఆయనకు అర్హత లేదని టీఎంసీ నేత మహువా మొయిత్రా ఒక ట్వీట్‌లో వెల్లడించారు. ఈ క్రమంలో స్వపన్ దాస్ గుప్తా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై రాజ్యసభ చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రేపటి కల్లా నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన రాజీనామా లేఖలో కోరారు.

Also Read:

తృణమూల్ కాంగ్రెస్ మాజీలకు టికెట్లు ఇస్తారా ? కోల్ కతాలో బీజేపీ కార్యకర్తల ఆగ్రహం, పార్టీ కార్యాలయాలపై దాడులు

Zomato Issue: షాకింగ్ ట్విస్ట్.. డెలివరీ బాయ్‌పైనే యువతి చెప్పుతో దాడి.. కేసు నమోదు