ఈ నెల 27 నుంచి అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల మహా ‘క్రతువు’ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలో, ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని ఒపీనియన్ పోల్స్ నిర్వహించగా.. ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన బెంగాల్ లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాక..హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చునని తేలుతోంది. అస్సాం, పుదుచ్చేరిలను బీజేపీ (ఎన్డీయే) దక్కించుకోవచ్చ్చునని, కేరళలో యధా ప్రకారం ఎల్ డీ ఎఫ్ హవా కొనసాగుతుందని వెల్లడైంది. బెంగాల్ విషయానికే వస్తే.. 294 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ 200 కి పైగా, సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 135 సీట్లను గెలుచుకోవచ్చునని భావిస్తున్నారు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంటున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎలా అయినా 183 సీట్లను దక్కించుకుంటుందని అంచనా.తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 144 సీట్లను, ఎన్డీయే 85 స్థానాలను గెలుచుకోవచ్చు. ఇక్కడ మెజారిటీ మార్క్ 118.
పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను 21 సీట్లను ఎన్డీయే, తొమ్మిదింటిని యూపీఏ దక్కించుకోవచ్చు . కేరళలో సీ ఓటర్ పోల్ విశ్లేషణ ప్రకారం 140 సీట్లున్న శాసన సభలో ఎల్ డీ ఎఫ్ 77 సీట్లలో విజయం సాధిస్తుందట. ఇక్కడ మెజారిటీ మార్క్ 71. ప్రస్తుతం ఇక్కడ ఎల్ డీ ఎఫ్ అధికారంలో ఉంది.
అస్సాంలో సీఓటర్, టీవీ 9 ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీయే 71 సీట్లను, యూపీఏ 53 స్థానాలను గెలుచుకుంటాయని భావిస్తున్నారు. అయితే చివరి క్షణం వరకు ఫలితాలు ఉత్కంఠ కల్గించేవిగానే ఉంటాయి. ఓటరు నాడి తెలుసుకోవడం చాలా కష్టం. సాధారణంగా తమిళనాడులో ఓ ఐదేళ్లు పాలక పార్టేకి, మరో ఐదేళ్లు విపక్షానికి ప్రజలు అవకాశం ఇస్తారు. మరి ఈ సారి ఇక్కడ ఫలితం కూడా అలాగే ఉండవచ్చు. బెంగాల్ లో మాత్రం బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు ఉంది గనుక సహజంగానే హంగ్ అసెంబ్లీ ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీకీ స్పష్టమైన పూర్తి మెజారిటీ రాకపోతే ఇక ఇదే పరిస్థితి ఏర్పడుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ :భారత్‌లో మితిమీరి రెచ్చిపోతున్న కరోనా సెకండ్ వేవ్..18 రాష్ట్రలో లాక్‌డౌన్..? : Coronavirus in India video.
ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా..వీడి చేష్టలకు నెటిజెన్ల ఫిదా !:Little Boy Funny Video.