Uttar Pradesh Elections 2022: యవతపై యోగీ సర్కార్ వరాల జల్లు.. వాజ్‌పేయి జయంతి సందర్భంగా టాబ్స్, స్మార్ట్‌ ఫోన్ల పంపిణీ..

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:26 PM

యూపీ యోగి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూవ ఓటర్లను ఆకట్టుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో వారిపై వరాల జల్లు కురిపించింది.

Uttar Pradesh Elections 2022: యవతపై యోగీ సర్కార్ వరాల జల్లు.. వాజ్‌పేయి జయంతి సందర్భంగా టాబ్స్, స్మార్ట్‌ ఫోన్ల పంపిణీ..
Yogi Adityanath Government
Follow us on

Atal Bihari Vajpayee Birth Anniversary: యూపీ యోగి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూవ ఓటర్లను ఆకట్టుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో వారిపై వరాల జల్లు కురిపించింది. ఈసారి యువతని టార్గెట్ చేసుకుని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే డిగ్రీ చదువుతున్నవిద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వాలని భావిస్తోంది. ఈ పథకాన్ని బిజెపి దిగ్గజం, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా వారికి అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్లను B.Tech, BA, B.Sc, MA, ITI, MBBS, MD, M.Tech, PhDతోపాటు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులకు అదించనుంది. లక్నోలోని వాజ్‌పేయి ఏకనా స్టేడియం. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి బాలికలతో సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం డిసెంబర్ రెండో వారం నుంచి విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ ఉచితంగా అందించనుంది.

ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు పంపిణీ చేయడంతోపాటు వారు చదువుతున్న విద్యకు సంబంధించిన కంటెంట్‌ను అందజేస్తారు. అలాగే స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు వారి మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు.

విద్యార్థులకు పంపిణీ చేయబోయే ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం వారు ఎక్కడికి వెళ్లి నమోదు చేసుకోవలసిన అవసరం లేదు. ఇందుకోసం ‘DG Shakti’ అనే ప్రత్యేక పోర్టల్‌ను తయారు చేసింది. త్వరలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ పోర్టల్ ప్రారంభించనున్నారు. రిజిస్ట్రేషన్ నుంచి స్మార్ట్‌ఫోన్లు, టాబ్స్ డెలివరీ వరకు మొత్తం ఉచితంగా యోగి సర్కార్ అందించనుంది. విద్యార్థుల డేటాను కాలేజీల వారీగా యూనివర్సిటీ నుంచి అందజేయనున్నారు.

విద్యార్థుల డేటా ఫీడింగ్ యూనివర్సిటీ స్థాయిలోనే జరుగుతోంది. సోమవారం వరకు దాదాపు 27 లక్షల మంది విద్యార్థుల డేటాను పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. మిగిలిన ఇతర విద్యార్థుల డేటా ఫీడింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్స్ కొనుగోలు కోసం ప్రభుత్వం GeM పోర్టల్‌లో రూ. 4,700 కోట్ల విలువైన టెండర్‌ను విడుదల చేసింది.

ఇప్పటికే పలు కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్స్ కోసం టెండర్లు వేయగా.. తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది. సాంకేతిక పరిశీలన తర్వాత అర్హత కలిగిన సంస్థల ఫైనాన్షియల్ బిడ్‌లు ఓపెన్ చేస్తారు. డిసెంబర్‌ మొదటి వారంలోగా వర్క్‌ ఆర్డర్‌ వచ్చే అవకాశం ఉంది. టెండర్‌లో ఎంపికైన కంపెనీలు మొదటి లాట్‌లో కనీసం 2.5 లక్షల ట్యాబ్లెట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కోసం ఎంపిక చేసిన కంపెనీలు మొదటగా కనీసం ఐదు లక్షల స్మార్ట్‌ఫోన్‌లను సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Afghanistan Heroin: కాబూల్‌ వీధుల్లో యధేశ్చగా మెథామ్‌ విక్రయం.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తాలిబన్ల నయా ప్లాన్..

Adimulapu Suresh: గండి పూడ్చకుంటే నేనే చెరువులో దూకుతా.. అధికారులకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌