Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం మహిళా మేనిఫెస్టోను విడుదల చేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారితే లక్ష్యం కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. మూడేళ్ల పాటు మహిళలకు గ్యాస్‌సిలిండర్లను ఉచితంగా అందిస్తామని భరోసా ఇచ్చారు. ట్యాక్స్ రాయితీలు కూడా ఇస్తామన్నారు. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు ప్రియాంక.
గతంలో కాంగ్రెస్ ‘లడ్కీ హూన్ లడ్ సక్తా హూన్’ గీతాన్ని విడుదల చేసింది. సామర్థ్యం, బలం, సంకల్పం మహిళలకు సహజసిద్ధమైన లక్షణాలని ప్రియాంక గాంధీ అన్నారు. స్త్రీలు ధైర్యం, కరుణ, ఆశలకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. మహిళల నిజమైన సాధికారత కోసం.. అలాంటి వాతావరణాన్ని సృష్టించడం కూడా అవసరమని అన్నారు. ఇది మా మహిళా మేనిఫెస్టో ప్రధాన స్ఫూర్తి అని ప్రియాంక అభిప్రాయ పడ్డారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు.
ఈ మేనిఫెస్టో మహిళా సాధికారతకు మార్గం చూపుతుందన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో బడ్జెట్‌లో 60 శాతం ప్రకటనలకే ఖర్చు చేసినట్లు ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలోని 60 శాతం మంది మహిళలు రాజకీయాల్లో తమ సత్తా చాటితే అన్నీ మారిపోతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రంలోని మహిళలకు సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, గౌరవం, ఆత్మగౌరవం కోసం ప్రత్యేకమైన, దృఢమైన ప్రత్యామ్నాయాన్ని అందజేస్తోందని ప్రియాంక గాంధీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..