జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని మోదీ.. తమిళులకు అండగా ఉంటాం.. ఈరోడ్ ఎన్నికల సభలో నడ్డా

|

Apr 03, 2021 | 3:21 PM

శ్రీలంకలోని జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని నడ్డా గుర్తు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ఈరోడ్‌లో రోడ్ షో నిర్వహించారు.

జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని మోదీ.. తమిళులకు అండగా ఉంటాం.. ఈరోడ్ ఎన్నికల సభలో నడ్డా
Bjp President Jp Nadda
Follow us on

JP Nadda in Tamil Nadu: తమిళుల సంక్షేమానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. శ్రీలంకలోని జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని నడ్డా గుర్తు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ఈరోడ్‌లో రోడ్ షో నిర్వహించారు. తమిళులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో మోదీ పర్యటించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జాఫ్నాలో బాంబ్‌ దాడి నిర్వాసితులకు చేసిన సాయాన్ని వివరించారు.


‘‘ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా జాఫ్నాలో పర్యటించలేదన్నారు. ఆ ప్రాంతంలో పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీనే. అక్కడ పర్యటించడమే కాకుండా బాంబు దాడి నిర్వాసితులకు ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేశారని నడ్డా గుర్తు చేశారు. విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్‌ను కూడా అక్కడికి పంపించారు. ఆ ప్రాంతంలో ఉన్న మైనారిటీలైన తమిళలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కానీ స్టాలిన్ మాత్రం కరుప్పర్ కొట్టాం సంఘటనను ఇప్పటి వరకు ఖండించలేదు’’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తమిళులకు అండగా నిలిచే ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

Also Read…

బెంగుళూరు డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు.. బయటపడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల పేర్లు..!

Tamilnadu Assembly Elections 2021 : ఖుష్బూ పోటీ చేస్తోన్న థౌజండ్‌ లైట్స్ లో అమిత్ షా రోడ్ షో