
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ మెజారిటీ దిశగా వెళ్తున్న నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 120 సీట్ల మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రధాని పర్యటన ప్రభావం చూపలేదని.. మత రాజకీయాలు రాష్ట్రంలో పనిచేయవన్నారు. వరుణ నియోకవర్గంలోని బరిలోకి దిగిన సిద్దరామయ్య బీజేపీకి చెందిన మంత్రి సోమన్నపై 2710 ఓట్ల అధిక్యంతో దూసుకెళ్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకాపురం నియోజకవర్గంలో గెలిచారు.
ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు అవుతారనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇప్పిటికే సిద్దరామయ్య కుమారుడు యతింద్ర సిద్ధరామయ్య.. మా నాన్నే ముఖ్యమంత్రి కావాలని వ్యాఖ్యానించారు. మరోవైపు డీకే శివకుమార్ కాంగ్రెస్ రెబల్స్‌తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రెబల్స్‌ను తన గూటికి తీసుకొచ్చే పనిలో పడ్డ శివకుమార్.. ఐదుగురు రెబల్స్‌తో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు రావల్సి ఉంటుంది.
మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..