Mamata Banerjee: కాంగ్రెస్‌ మాతో కలిసి రావాలి.. బీజేపీ టార్గెట్‌గా గోవాలో మమత ప్రచారం..

జాతీయ పార్టీగా తృణమూల్‌కాంగ్రెస్‌ను తీర్చిదిద్దాలన్న ప్రయత్నాల్లో ఉన్న మమత గోవాపై కన్నేశారు. రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు బెంగాల్‌ సీఎం . గోవాలో ఇటీవలి కాలంలో మమత పర్యటించడం ఇది రెండోసారి.

Mamata Banerjee: కాంగ్రెస్‌ మాతో కలిసి రావాలి.. బీజేపీ టార్గెట్‌గా గోవాలో మమత ప్రచారం..
Mamata Banerjee

Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:28 PM

Goa Assembly elections: జాతీయ పార్టీగా తృణమూల్‌కాంగ్రెస్‌ను తీర్చిదిద్దాలన్న ప్రయత్నాల్లో ఉన్న మమత గోవాపై కన్నేశారు. రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు బెంగాల్‌ సీఎం . గోవాలో ఇటీవలి కాలంలో మమత పర్యటించడం ఇది రెండోసారి. ఆమెతో పాటు టీఎంసీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ఈసారి పర్యటనలో పాల్గొంటున్నారు. మమతా బెనర్జీ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గోవా ఇంటర్నేషనల్ సెంటర్‌లో గోవా టీఎంసీ నేతలతో సమావేశం నిర్వహించిన మమత ఎన్నికల వ్యూహాన్ని రచించారు.

విపక్షాల ఓట్లను చీల్చడానికే గోవాలో టీఎంసీ పోటీ చేస్తోందన్న విమర్శలనను కొట్టి పారేశారు మమత. బీజేపీ వ్యతిరేకంగా విపక్షాలను తాము ఏకం చేస్తున్నామని , ఎవరైనా తమతో కలిసి రావచ్చని అన్నారు.
గోవా పర్యటనలో మమతా బెనర్జీ మూడు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇందులో ఒక సభ దక్షిణ గోవాలో జరుపగా , రెండు సమావేశాలు ఉత్తర గోవాలో జరుగుతున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ఐదు వాగ్దానాలను ప్లాన్ చేసింది, ఆ పార్టీ ఇప్పటివరకు మూడు వాగ్దానాలు చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ పథకం కింద గోవా మహిళలు నెలకు రూ. 5,000 అందిస్తామన్నారు. తృణమూల్ వాగ్దానం ప్రకారం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోని మహిళలకు డబ్బులు ఇచ్చేలా తృణమూల్ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు టిఎంసిపై విరుచుకుపడగా, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం టిఎంసిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఆదివారం నాడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గోవాలో టీఎంసీ, ఆప్ మధ్య ఎలాంటి ఒప్పందం ఉండబోదని స్పష్టం చేశారు. గోవా ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. TMCతో ఎలాంటి ఒప్పందమూ ఉండదు. మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిస అవసరం ఉందని టీఎంసీ పిలుపునిచ్చింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో టీఎంసీ పొత్తు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి: CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం