AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Exit Poll Results: యూపీలో యోగికే మళ్లీ బ్రహ్మరథం.. పంజాబ్‌లో ఆప్‌ హవా.. ఉత్తరాఖండ్‌, గోవాలో టఫ్‌ ఫైట్‌..

Assembly Elections Exit Poll Results 2022: యూపీలో యోగికే మళ్లీ బ్రహ్మరథం , పంజాబ్‌లో ఆప్‌ ఘనవిజయం సాధిస్తుందని ఎగ్జిట్‌‌ పోల్స్‌ అంచనా వేశాయి. గోవా,ఉత్తరాఖండ్‌లో బీజేపీ -కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఉత్తరప్రదేశ్‌ మరోసారి..

UP Exit Poll Results: యూపీలో యోగికే మళ్లీ బ్రహ్మరథం.. పంజాబ్‌లో ఆప్‌ హవా.. ఉత్తరాఖండ్‌, గోవాలో టఫ్‌ ఫైట్‌..
Exit Poll Results
Sanjay Kasula
|

Updated on: Mar 07, 2022 | 10:30 PM

Share

యూపీలో యోగికే(UP Election 2022) మళ్లీ బ్రహ్మరథం , పంజాబ్‌లో ఆప్‌(App) ఘనవిజయం సాధిస్తుందని ఎగ్జిట్‌‌ పోల్స్‌(Exit Polls) అంచనా వేశాయి. గోవా,ఉత్తరాఖండ్‌లో బీజేపీ -కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఉత్తరప్రదేశ్‌ మరోసారి యోగికే పట్టం కడుతుందని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిచెప్పాయి. బీజేపీ 40 శాతం ఓట్లతో 211 నుంచి 225 సీట్లు సాధిస్తుందని TV9-పోల్‌స్ట్రాట్‌ ఎగ్జిట్‌పోల్‌ చెప్పింది. సమాజ్‌వాదీకి 146 నుంచి 160 సీట్లు, బీఎస్పీకి 14 నుంచి 24, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని TV9-పోల్‌స్ట్రాట్‌ తెలిపింది. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీకి ఎగ్జిట్‌పోల్స్‌ పట్టం కడితే, ఉత్తరాఖండ్‌లో హోరా హోరీ, గోవాలో హంగ్‌ రావచ్చని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పాయి. మణిపూర్‌లో బీజేపీకి ఎక్కువ విన్నింగ్‌ చాన్స్‌ ఉన్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

  1. రిపబ్లిక్‌-P మార్క్‌ సర్వే యూపీలో బీజేపీకి 240 సీట్లు SPకి 140, BSPకి 17 సీట్లు
  2. ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వేలో బీజేపీ బ్రహ్మాండమైన విజయం యూపీలో బీజేపీకి 288-326 సీట్లు ఎస్పీకి 71-101 సీట్లు వచ్చే అవకాశం బీఎస్పీకి 3-9 సీట్లు కాంగ్రెస్‌కు 3 సీట్లు వచ్చే అవకాశం
  3. ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వేలో పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీకి 76 నుంచి 90 సీట్లు

రిపబ్లిక్‌-P మార్క్‌ సర్వే యూపీలో బీజేపీకి 240 సీట్లు వస్తాయనీ, SPకి 140, BSPకి 17 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వేలో బీజేపీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. యూపీలో బీజేపీకి 288-326 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఎస్పీకి 71-101 సీట్లు వచ్చే అవకాశముంది. బీఎస్పీకి 3-9 సీట్లు కాంగ్రెస్‌కు 3 సీట్లు వచ్చే అవకాశముందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వే పంజాబ్లో ఆమ్‌ఆద్మీకి 76 నుంచి 90 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 31 సీట్లు వస్తాయిన తెలిపింది. ఇక న్యూస్‌-24, ABP-C ఓటర్‌ సర్వే ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌-బీజేపీల మధ్య గట్టిపోరాటం ఉంటుందని తెలిపింది.

ఉత్తరాఖండ్‌లో బీజేపీకి 26-32 , కాంగ్రెస్‌కు 32-38 సీట్లు ఆప్‌కు 2 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశారు. గోవాల్‌లో కూడా కాంగ్రెస్‌ , బీజేపీ మధ్య నువ్వా ? నేనా అన్న రీతిలో పోటీ ఉన్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. గోవా , ఉత్తరాఖండ్‌లో చిన్న పార్టీలు , స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముంది. జయం మనదే అంటున్నారు సమాజ్‌వాది చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌. తమ నేతృత్వంలోని కూటమి 300 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో ప్రతి బీజేపీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడిన పార్టీ మరొకటి లేదన్నారు అఖిలేష్‌ యాదవ్‌. ఈ ఎన్నికల్లో గెలిచేది తామేనని బీజేపీ నేత, యూపీ సీఎం యోగి ధీమాగా చెప్పారు. ప్రజలు మళ్లీ తమనే ఆశీర్వదిస్తారని చెప్పారాయన. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు- ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికలు సజావుగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు యోగి.

ఎగ్జిట్‌పోల్స్‌ రావడంతో ఆమ్‌ఆద్మీ జోష్‌ మీద ఉంటే, కాంగ్రెస్‌ లైట్‌ తీసకుంటోంది. పంజాబ్‌లో తమకు 80 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని- ఆమ్‌ఆద్మీ నేత, ఆ పార్టీ CM అభ్యర్థి భగవంత్‌ మాన్‌ చెప్పారు. అయితే పంజాబ్‌ CM ఛన్నీ మాత్రం- పదో తేదీ వరకు వేచిచూస్తామన్నారు. ఏం జరుగుతుందో ఎన్నికల ఫలితాలే చెబుతాయంటూ ఎగ్జిట్‌పోల్స్‌ను కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి: TV9 Exit Poll Results 2022: యూపీలో బీజేపీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీకి అధికారం..? ఎగ్జిట్ పోల్స్‌లో సంచలనాలు..

Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?