అస్సాం సీఎం సోనోవాల్, బీజేపీ చీఫ్ పై కాంగ్రెస్ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు
అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, బీజేపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు అస్సాం పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మరో 8 ప్రముఖ డైలీలపై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదైంది.
అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, బీజేపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు అస్సాం పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మరో 8 ప్రముఖ డైలీలపై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. ఎగువ అస్సాం ఎన్నికల్లో అన్ని సీట్లలో తమ పార్టీ విజయం ఖాయమన్నట్టుగా ఈ దినపత్రికల్లో యాడ్ లు వచ్చాయి. అస్సాం ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈ నెల 27 న జరిగింది. ఈ యాడ్ లు ఎన్నికల కోడ్ ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అతిక్రమించడమే అవుతుందని రాష్ట్ర పీసీసీ లీగల్ విభాగం చైర్మన్ నీరన్ బోరా ఆరోపించారు. ఈ మేరకు దిస్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో తమ ఓటమి తప్పదని భావించి ఈ పార్టీలు ఇలా ఓటర్లను ప్రభావితం చేసేందుకు పరోక్షంగా పేపర్ల ద్వారా ప్రకటనలు ఇఛ్చాయని ఆయన చెప్పారు. ఎన్నికల రెండు, మూడు దశల్లో ప్రజలను మోసగించేందుకు ముందుగా వేసుకున్న కుట్రగా దీన్ని ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని అంటూ న్యూస్ పేపర్లలో పతాక శీర్షికలతో సహా యాడ్ లు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 126 ఏ ని ఉల్లంఘించడమేనని, ఇందుకు రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా పడుతుందని నీరన్ అన్నారు.
మార్చి 27 వతేదీ ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29 వతేదీ సాయంత్రం ఏడున్నర గంటలవరకు ఎన్నికల ప్రీ-పోల్ రిజల్ట్స్ ను ఏ విధంగానూ ప్రకటించరాదని ఈసీ స్పష్టంగా గైడ్ లైన్స్ ని నిర్దేశించిందని ఆయన పేర్కొన్నారు. ఈ యాడ్ లు ప్రచురించిన ఆయా వార్తా పత్రికలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా తాము దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. మరిన్ని చదవండి ఇక్కడ :Chasing Video :బస్సును చేజ్ చెయ్..అంటు బైకర్ ను ఆపి రిక్వెస్ట్ చేసిన పోలీస్..( వీడియో ). Glass Bridge: హాట్ టాపిక్‌గా మారిన చైనా లో మరో అద్భుత కట్టడం…!! తప్పక చూడాల్సిందే… ( వీడియో )