CCTV Cameras: వీడు మాములు దొంగ కాదురా బాబు.. సీసీ కెమెరాలను దొంగిలిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా..

|

Nov 24, 2021 | 9:55 AM

ఫర్నీచర్‌ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు.. తాను పనిచేస్తున్న షాప్‌తో పాటు పక్కనే ఉన్న మరో 8 షాపుల ముందు పెట్టిన సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లాడు. ఇతను చేసిన పనికి అసలే బేరాలు..

CCTV Cameras: వీడు మాములు దొంగ కాదురా బాబు.. సీసీ కెమెరాలను దొంగిలిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా..
Follow us on

నా రూటే సపరేటు.. నా దారి రహదారి.. అంటూ కెమరాలన్నీ నావే.. ఇవి సినిమా డైలాగులు కాదు.. రాష్ట్రంలో కొత్త దొంగ ఎంట్రీ ఇచ్చాడు. వీడీ కంట్లో కెమెరా పడిందంటే ఇక అంతే..  నేరాలు, దొంగతనాలను అరికట్టేందుకు తెచ్చిన సీసీ కెమెరాలనే దొంగిలించాడు ఓ దొంగ. ఖమ్మం సీమా ఫర్నీచర్‌ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు.. తాను పనిచేస్తున్న షాప్‌తో పాటు పక్కనే ఉన్న మరో 8 షాపుల ముందు పెట్టిన సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లాడు. ఇతను చేసిన పనికి అసలే బేరాలు లేక అవస్థలు పడుతున్న షాపుల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. షాప్‌ యజమానులిచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక సీసీ కెమెరాల దొంగతనం అలా ఉంటే..నిర్మల్ జిల్లాలో బైకుల చోరీలకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. లోకేశ్వరం మండలం కనకపూర్ గ్రామంలో రెండు టివిఎస్ ఎక్స్ ఎల్ వాహనాలను చోరీ చేశారు. ఐతే ఓ వాహనాన్ని దొంగిలించి తీసుకెళుతూ సీసీ కెమెరాలో చిక్కాడు ఓ దొంగ. ఆ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..