Telangana: కత్తులతో గొంతులో పొడిచి.. రక్తపు మడుగులో మృతదేహం.. ఆ వ్యవహారమే కారణమా

|

Aug 08, 2022 | 4:07 PM

ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. భవిష్యత్ గురించి ఎన్నో కలలుగన్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వివాహానికి వీల్లేదని చెప్పేశారు. అయినా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఏమైందో..

Telangana: కత్తులతో గొంతులో పొడిచి.. రక్తపు మడుగులో మృతదేహం.. ఆ వ్యవహారమే కారణమా
Young Man Murder In Suryape
Follow us on

ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. భవిష్యత్ గురించి ఎన్నో కలలుగన్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వివాహానికి వీల్లేదని చెప్పేశారు. అయినా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఏమైందో కానీ ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. సూర్యాపేట పట్టణానికి చెందిన కోటయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు దిలీప్ (19).. ఎలక్ట్రికల్ డిప్లొమా రెండో ఏడాది చదువుతున్నాడు. గతంలో పట్టణంలోని తాళ్లగడ్డలో దిలీప్ కుటుంబం నివాసముండేది. ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు అమ్మాయి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సోదరిని ప్రేమించవద్దంటూ దిలీప్ కు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత దిలీప్ కుటుంబం తాళ్లగడ్డ నుంచి జనగామ క్రాస్ రోడ్డుకు మకాం మార్చింది. అయినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటలకు బయటకు వెళ్లిన దిలీప్ ఇంటికి రాలేదు. తెల్లవారేసరికి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ చౌదరి చెరువు కట్టపై విగత జీవిగా మారిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు దిలీప్ కత్తులతో దాడి చేసి గొంతులో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, దిలీప్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారమే తమ కొడుకుని పొట్టన పెట్టుకుందని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అమ్మాయిని ప్రేమించిన విషయం తమకు తెలియదని, నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. దిలీప్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయి పేరెంట్స్ తో గత రాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దిలీప్ ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న నేపధ్యంలో ఆ గొడవ కారణంగానే దిలీప్ హత్యకు గురయ్యాడా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని పోలీసులు తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు. దిలీప్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి