Crime News: సముద్ర తీరంలో యువతి శవం.. ప్రియుడు అరెస్ట్‌.. ఏపీలో కలకలం..

|

Oct 14, 2021 | 9:39 PM

Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. సంతబొమ్మాళి మండలంలోని

Crime News: సముద్ర తీరంలో యువతి శవం.. ప్రియుడు అరెస్ట్‌.. ఏపీలో కలకలం..
Crime News
Follow us on

Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరం వద్ద గురువారం గుర్తు తెలియని యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం అటుగా సుముద్ర తీర ప్రాంతానికి వెళ్లిన స్థానికులకు ఓ మృతదేహం కనిపించింది. దీంతో వారు నౌపాడ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి విషం తాగినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే.. మృతురాలు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన యువతిగా నౌపాడ పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి ఆమె గురువారం భావనపాడు సముద్రతీరానికి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో ప్రియుడు, ప్రియురాలి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో ఆమె విషం తాగినట్లు పేర్కొంటున్నారు. విషం వెంట తెచ్చుకున్న యువతి సమీపంలోని జీడిమామిడి తోటకు వెళ్లి తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయితే.. ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. ఈఘటనపై పలు కోణాల్లో విచారిస్తున్నట్లు నౌపాడ పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: ప్రియుడితో కలిసి ప్లాన్.. భర్తను చంపిన భార్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Crime News: దారుణం.. రూ.100 కోసం గొడవ.. స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన దుర్మార్గుడు..

Ayodhya: అయోధ్యలో కలకలం.. దుర్గా పూజ మండపం వద్ద కాల్పులు.. ఒకరు మృతి..