AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suspected Death: కృష్ణా నదిలో వివాహిత మృతదేహం.. ఒంటి నిండా గాయాలతో పలు అనుమానాలు..!

వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

Suspected Death: కృష్ణా నదిలో వివాహిత మృతదేహం.. ఒంటి నిండా గాయాలతో పలు అనుమానాలు..!
Crime News
Balaraju Goud
|

Updated on: Aug 03, 2021 | 9:19 AM

Share

Woman Suspected Death: వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. బంటుమిల్లి మండలం రామన్నమోడి గ్రామానికి చెందిన రామాని దుర్గ (35)ను బందరు మండలం కొత్త పల్లెతుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామాని పోతురాజుకు ఇచ్చి ఏడేళ్ల క్రితం రెండో వివాహం చేశారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. రెండు రోజుల క్రితం కనిపించకుండాపోయిన దుర్గ సోమవారం కొత్తపల్లెతుమ్మలపాలెం సమీపంలో కృష్ణానదిలో శవమై తేలింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు దుర్గ మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రెండు రోజులుగా కనిపించకుండాపోయిన దుర్గ శవమై తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా దుర్గ మెడ, శరీరంపై బలమైన దెబ్బలు ఉన్నాయి. దుర్గను చంపేసి మృతదేహాన్ని కృష్ణానదిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మెడకు ఉరివేసినట్లుగా గుర్తులున్నాయని, చంపేసిన అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కృష్ణానదిలో పడవేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దుర్గ భర్త పోతురాజు పరారీలో ఉన్నాడని, దుర్గ మామను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు రూరల్‌ సీఐ కొండయ్య తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read Also…  రోడ్డుపై యువతీ రచ్చ..రచ్చ..రీజన్ ఏంటో తెలియదు..అందక పోయిన ఎగిరెగిరి కొడుతుంది..!:Woman Viral Video.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!