Guntur: రూ.300 ఇవ్వలేదని లారీతో తొక్కించి చంపాడు.. పల్నాడు జిల్లాలో దారుణం
ప్రస్తుత సమాజంతో మానవ సంబంధాల కంటే మనీ సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా.. చిత్తు కాగితాలు ఏరుకునే ఓ మహిళ పట్ల లారీ డ్రైవర్ కర్కశంగా ప్రవర్తించాడు. పిల్లలతో కలిసి లారీ ఎక్కిన మహిళ పట్ల క్రూరంగా....
ప్రస్తుత సమాజంతో మానవ సంబంధాల కంటే మనీ సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా.. చిత్తు కాగితాలు ఏరుకునే ఓ మహిళ పట్ల లారీ డ్రైవర్ కర్కశంగా ప్రవర్తించాడు. పిల్లలతో కలిసి లారీ ఎక్కిన మహిళ పట్ల క్రూరంగా వ్యవహరించి ఆమె మృతికి కారణమయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కారణంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పల్నాడు(Palnadu) జిల్లాలోని చిలకలూరిపేటకు(Chilakaluripet) చెందిన మహిళ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తోంది. ఉపాధి కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లేందుకు లారీ ఎక్కింది. గుంటూరు(Guntur)లోని నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలోకి చేరుకోగానే మహిళ తన పిల్లలతో కలిసి లారీ దిగింది. లారీ డ్రైవర్ కు వంద రూపాయలు ఇవ్వగా అతడు నిరాకరించాడు. ఇంకా రెండు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బుల్లేవని ఆ మహిళ ఎంత చెప్పినా డ్రైవర్ వినిపించుకోలేదు.
మహిళ కుమార్తె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ని లాక్కున్నాడు. ఆమె సెల్ ఫోన్ కోసం లారీ ఎక్కగానే డ్రైవర్ బండి స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అది చూసి కంగారు పడిన మహిళ.. కూతురు కోసం లారీని పట్టుకుని వేలాడుతూ కొంత దూరం అలానే వెళ్లింది. తర్వాత అదుపుతప్పి లారీ కింద పడి మృతి చెందింది. మహిళ మృతి చెందడం చూసిన డ్రైవర్ లారీ ఆపి అందులోని పాపను కిందికి దించి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. లారీ కింద పడి మృతి చెందిన తల్లి మృతదేహంపై పడి పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Ratlam Temple: ఆ ఆలయానికి వెళ్తే.. వెండి, బంగారం నాణేలు ప్రసాదంగా ఇస్తారు.. మన దేశంలోనే