Crime News: నమ్మకంతో నట్టేట ముంచిన మహిళ.. చిట్టీ పేరుతో రూ.5.6 కోట్ల మేర కుచ్చుటోపీ..

|

Sep 05, 2021 | 10:17 AM

Woman Fraud rs 5.6 crore: చీటి పాటల పేరుతో ఓ మహిళ భారీ మొత్తంలో దోచుకుంది. సుమారు రూ.5.60 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని

Crime News: నమ్మకంతో నట్టేట ముంచిన మహిళ.. చిట్టీ పేరుతో రూ.5.6 కోట్ల మేర కుచ్చుటోపీ..
Woman Fraud
Follow us on

Woman Fraud rs 5.6 crore: చీటి పాటల పేరుతో ఓ మహిళ భారీ మొత్తంలో దోచుకుంది. సుమారు రూ.5.60 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చినగంజాం పంచాయతీ పరిధిలోని సోపిరాలలో వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. సోపిరాలకు చెందిన పోలకం ఝాన్సీలక్ష్మి, వెంకటస్వామి దంపతులు. వెంకటస్వామి మిలటరీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఝాన్సీలక్ష్మి సుమారు 25 ఏళ్లుగా సోపిరాలలో ఉంటూ చీటీ పాటలు నిర్వహిస్తూ అందరికీ నమ్మకం కలిగించారు. చీటీ పాటలు వేస్తున్న వారితో పాటు ఇతరుల నుంచి రూ. లక్ష, రూ.2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల చొప్పున అప్పుగా తీసుకున్నారు. ఇలా ఆ మహిళ సుమారు రూ.5.60 కోట్ల వరకు పాటదారులు, అప్పులిచ్చిన వారికి చెల్లించాల్సి ఉంది.

అయితే.. కొన్నినెలలుగా ఆమె బాకీలు చెల్లించడం లేదు. ఈ క్రమంలోనే తాను ఉండే ఇంటిని ఝాన్సీలక్ష్మి ఇటీవల విక్రయించారు. అదేసమయంలో హైదరాబాద్, చీరాల తదితర పట్టణాల్లో విలువైన భవనాలు, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. అయితే చీటీ పాటలు పాడిన వారికి డబ్బులు చెల్లించకపోవడం, అప్పులు తీసుకున్నవారికి ఇవ్వకుండా తిప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో బాధితులందరూ గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటకువచ్చింది. దీంతో డబ్బును కుటుంబ సభ్యులు, బంధువులకు ఇచ్చినట్టు ఝాన్సీలక్ష్మీ చెప్పింది.

అయితే.. తమకు న్యాయం చేయాలని కోరుతూ సుమారు యాభై మంది బాధితులు చినగంజాం పోలీసులను శనివారం ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంకొల్లు సీఐ సుబ్బారావు, ఎస్సై పి.అంకమ్మరావు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం.. మహిళ 5కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

Also Read:

India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కేరళలోనే 30 వేల కేసుల నమోదు..

Divi Vadthya: ‘ఈ కళ్లను చూస్తూ బతికేయొచ్చు’… కుర్రకారు మతి పోగొడుతోన్న అందాల దివి లేటెస్ట్‌ ఫొటోలు.