Crime news: పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వివాహేతర సంబంధం.. భార్యాభర్తల ఆత్మహత్య.. అనాథగా మిగిలిన నాలుగేళ్ల బిడ్డ..

వివాహేతర సంబంధం ఓ పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. భార్య వేరేవారితో సంబంధం పెట్టుకుందన్న మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడగా.

Crime news: పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వివాహేతర సంబంధం.. భార్యాభర్తల ఆత్మహత్య.. అనాథగా మిగిలిన నాలుగేళ్ల బిడ్డ..

Updated on: Nov 06, 2021 | 10:21 PM

వివాహేతర సంబంధం ఓ పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. భార్య వేరేవారితో సంబంధం పెట్టుకుందన్న మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడగా.. ఈ విషయం తెలుసుకున్న భార్య కూడా 12 గంటల్లోనే బలవన్మరణానికి పాల్పడింది. ఇలా తల్లిదండ్రూలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి.

భోపాల్‌లోని టీటీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో భార్యాభర్తల సంసారం సాఫీగానే సాగింది. వీరి దాంపత్య బంధానికి గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఏడాది క్రితం మహిళకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం భర్తకు తెలియడంతో సంసారంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపం చెందిన భర్త ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోయిన విషయం తెలుసుకుని భార్య కూడా పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో దొరికిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాగర్‌ బాబా అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read:

Crime News: బ్లాక్‌మెయిల్‌ దందాతో బీఎండబ్ల్యూ కొన్నారు.. పోలీసుల చేతికి చిక్కారు..

US Music Festival: మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో మరణ మృదంగం.. తొక్కిసలాటలో 8 మంది మృతి.. 300 మందికి పైగా గాయాలు..

Viral News: తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని