ఆర్థిక అసమానతలు, నిరక్షరాస్యత, బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ ఇలా పలు కారణాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు(Child Marriage) పెరిగుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదని ఐసీపీఎస్(ICPS) విభాగ అధికారులు చెబుతున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉన్న వీరు బాల్య వివాహాల నిరోధానికి పని చేస్తున్నారు. ప్రతి నెల గ్రామ, మండల కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికల సంక్షేమానికి అందుబాటులో ఉన్న పథకాలు, చిన్న వయసులో వివాహం వల్ల కలిగే నష్టాలు తెలియజేస్తున్నారు. బాల్యవివాహాల గురించి సమాచారం తెలిసిన వారు 1098 హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు.
మహిళాశిశు సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 2015 నుంచి 6,600 బాల్య వివాహాలు ఆపినట్లు అధికారులు చెబుతున్నారు. 2019-21 ఐదో నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఏపీలో 20-24 మధ్య వయసు ఉన్న 29.3% మహిళలకు 18 ఏళ్ల లోపలే పెళ్లిళ్లు అయిపోయాయి. 21.7% పట్టణ ప్రాంతాలైతే 32.9% గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. వీరిలో 29.3% మంది 15-19 మధ్య వయసులో గర్భం దాల్చిచనట్లు సర్వే నివేదికలు తెలిపాయి. అదే తెలంగాణలో అయితే 2020 లో బాల్యవివహాలు 27% పెరిగాయి. ఫిబ్రవరి 2019 నుంఠి మార్చి 2020 మధ్య 97 వివాహాలను అడ్డుకున్నారు. ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 మధ్య 1,355 పెళ్లిళ్లను ఆపారు. నగర ప్రాంతాల్లో తక్కువగా జరిగే బాల్య వివాహాలు కరోనా సమయంలో ఎక్కువగా జరిగాయి. ఇవి అధికారికంగా విడుదల చేసిన లెక్కలు మాత్రమే. బయటకు రాని లెక్కలు మరెన్నో.
బాల్య వివాహ నిషేధ చట్టం 2007 జనవరి 10న ఆమోదం పొందింది. ఇది నవంబరు ఒకటిన అమలులోకి వచ్చింది. దీని ప్రకారం బాల్య వివాహాన్ని ప్రోత్సహించే వారితో పాటు చేసే వారికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా లేదా రెండూ విధించవచ్చు. బాల్యవివాహం చేయడం ద్వారా పిల్లలు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సతమతమవుతారు. బాలికలు చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో తల్లీబిడ్డలకు ప్రమాదం ఏర్పడుతోంది. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విద్యాహక్కును హరిస్తుంది. పిల్లలు నిరక్షరాస్యులుగా, నైపుణ్యం లేని వారిగా మిగిలిపోతారు.
Also Read
TRS: తెలంగాణకు నవోదయ విద్యాలయాల కేటాయింపులో కేంద్రం అన్యాయం.. బీజేపీపై నామా అటాక్.
Samantha: బాలీవుడ్‌లో పాగా వేస్తున్న సమంత.. క్యూ కడుతోన్న వరుస ఆఫర్లు..
Market News: ఒడిదొడుకుల్లో ఊగిసలాడుతున్న సూచీలు.. లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి..