కట్టుకున్న భర్తపై ఎందుకు కోపమొచ్చిందో కానీ ఓ మహిళ కర్కశంగా ప్రవర్తించింది. ఏ మాత్రం కనికరం లేకుండా మాంసం కోసే కత్తితో అతనిపై దాడి చేసింది. ఏకంగా 140 సార్లు పొడిచి చంపేసింది. అంతటితో ఆగకుండా భర్త పుర్రెను ముక్కలు ముక్కలుగా చేసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పామ్ బీచ్ కౌంటీలోని పామ్ స్ప్రింగ్స్ కౌంటీకి చెందిన ఏండ్ల జోన్ బుర్కే ( 61), ఏండ్ల భర్త మెల్విన్ వెల్లర్ (62) భార్యాభర్తలు. మెల్విన్ దివ్యాంగుడు కూడా. అయితే ఏమైందో తెలియదు కానీ ఇటీవల జోన్ బుర్కే తన భర్తను మాంసం కోసే కత్తితో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ భయానక ఘటన గురించి 41 ఏళ్ల కుమారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ వంటగదిలో రక్తపు మడుగుల్లో నిర్జీవంగా పడి ఉన్న పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మృతదేహంపై 140 కత్తిపోట్లను గుర్తించారు. మృతుడి కపాలం బాగా చిద్రమైందని పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. కాగా భర్తను కర్కశంగా హతమార్చిన జోన్ బుర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కింద కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దివ్యాంగుడైన భర్తను ఎందుకు హతమార్చిందో నిందితురాలు నోరువిప్పడం లేదు. మౌనంగా ఉండటంతో ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read:Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..
Vijay Deverakonda: రష్మికతో ప్రేమ, పెళ్లి వార్తలపై తన మార్క్ ట్వీట్ వేసిన రౌడీ హీరో.. ఫుల్ క్లారిటీ
యజమానికి గుణపాఠం చెప్పిన పెంపుడు కుక్క !! ఇంతకీ ఏం చేసిందంటే ?? వీడియో