Wedding Celebrations: వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి 11 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ (Kushinagar) జిల్లా నెబువా నౌరంజియాలో చోటుచేసుకుంది. వివాహ కార్యక్రమంలో భాగంగా కొంతమంది వ్యక్తులు బావి స్లాబ్‌పై కూర్చున్నారు. ఈ క్రమంలో అధిక లోడు కారణంగా బావిపైనున్న స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దానిపై కూర్చున్న 13 మంది బావి (well) లోపల పడినట్లు పోలీసులు తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు పేర్కొంది.
ఈ ఘటనపై కుషీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం మాట్లాడుతూ.. బావి స్లాబ్‌పై కొంతమంది కూర్చుని ఉన్నారని అధిక లోడ్ కారణంగా కూలిపోయినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఆయన వెల్లడించారు. కాగా.. ఖుషీనగర్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
UP | 11 people died & two are seriously injured after they accidentally fell into a well. During a wedding program, some people were sitting on a slab of a well and due to heavy load the slab broke. An ex-gratia of Rs 4 lakh will be given to the kin of the deceased: DM Kushinagar pic.twitter.com/6PHeVYATp0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2022
Also Read: