క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతుంది. టెక్నాలజీని నేరాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. పక్కా స్కెచ్ వేసి.. నిలువునా దోచేస్తున్నారు. తాజాగా మీసేవా పోర్టల్ వివరాలు హ్యాక్ చేసి పలు సేవల ద్వారా వచ్చే కమీషన్లను కాజేసిన ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. దిమ్మతిరిగే విషయాలు వెల్లడించాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కి చెందిన కాసాని జగన్ నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ.. జీవినం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విలాసాలకు అవాటుపడి.. ఈజీ మనీ కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. బైక్‌పై ఉన్న చలాన్లు కట్టడానికి మీ సేవ సెంటర్‌కు వెళ్లినపుడు లాగిన్ వివరాలు తస్కరించాడు. తన ఫ్రెండ్స్ నుంచి కొంత సమాచారం సేకరించి, యూట్యాబ్‌లోని వీడియోల ద్వారా మీ సేవా పోర్టర్లో లాగిన్ అయ్యాడు. ఈసీ లాంటి పలు కీలక డాక్యుమెంట్లు నుంచి వచ్చే కమీషన్‌ను తన అకౌంట్లకు మళ్లించుకున్నాడు. తన ఐడీ ద్వారా ఇదంతా జరిగిందని తెలుసుకున్న మీసేవా ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశాడు.
దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైం టీమ్ రంగంలోకి దిగింది. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చూశారుగా ఏకంగా అంత సెక్యూరిటీ ఉంటే.. మీ సేవా పోర్టల్ నే హ్యాక్ చేశాడు. తస్మాత్ జాగ్రత్త.. లేకపోతే మన జీవితాలు కూడా రోడ్డున పడిపోతాయ్.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి