Thunderstorm: కొద్దిసేపట్లో పెళ్లి.. ప్రకృతి ప్రకోపానికి ఇద్దరు బలి, మరో ముగ్గరికి తీవ్ర గాయాలు. పెళ్లింట తీవ్ర విషాదం!

|

Aug 14, 2021 | 6:37 PM

కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతున్న సమయంలో ప్రకృతి ప్రకోపించింది. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చి ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

Thunderstorm: కొద్దిసేపట్లో పెళ్లి.. ప్రకృతి ప్రకోపానికి ఇద్దరు బలి, మరో ముగ్గరికి తీవ్ర గాయాలు. పెళ్లింట తీవ్ర విషాదం!
Thunderstorm
Follow us on

కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతున్న సమయంలో ప్రకృతి ప్రకోపించింది. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చి ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని చాకలిపేటలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.

విజయనగరం రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకలిపేటలో శుక్రవారం జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఐదుగురు వ్యక్తులు సాయంత్రం సమయంలో రామనారాయణం వద్ద ఉన్న మామిడి తోటలో చెట్ల కింద కూర్చొన్నారు. ఈ సమయంలో హఠాత్తుగా వర్షం కురవడంతో వారంతా తోటలోనే ఉండిపోయారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులు పడటంతో ఒక పక్క కూర్చున్న చాకలిపేటకు చెందిన పి.ఎర్నిబాబు (28), సురేష్‌ (26) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకవైపు కూర్చున్న సారిక శ్రీను, వెంకటేష్‌, కళింగపట్నం పెంటయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. కాగా, అక్కడికి చేరుకున్న స్థానికులు గాయపడ్డ వారిని విజయనగరం జిల్లా ఆసుపత్రికి చికిత్స నమిత్తం తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. చనిపోయిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.

Read Also… Viral News: ఖాకీ యూనిఫాం వెనుక వెన్నలాంటి మనసు.. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించిన సూపర్ పోలీస్..

 “షేర్ అండ్ కేర్”తో ముందుకెళ్దాం.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

‘చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు ఉండవు.. విలువ‌లనే పునాదులపై వెల‌సిన పార్టీ’