Visakha Murder mystery: సాగర తీరంలో సైట్‌ ఇంజినీర్‌ మర్డర్‌ మిస్టరీ వీడింది.. అంతా అనుకున్నట్లు హంతకుడు ఎవరో తేలిపోయింది..

|

Jul 08, 2021 | 9:36 AM

విశాఖలో సైట్‌ ఇంజినీర్‌ రెడ్డి గోపాలకృష్ణ మర్డర్‌ మిస్టరీ వీడింది. నిందితుడు బ్రహ్మయ్యను అరెస్ట్‌ చేశారు పోలీసులు. రెండ్రోజుల క్రితం బీచ్‌రోడ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో గోపాలకృష్ణను హత్య చేశారు. మృతుడితో కలిసి మద్యం తాగిన బ్రహ్మయ్య.. గోపాలకృష్ణతో గొడవ పడ్డాడు.

Visakha Murder mystery: సాగర తీరంలో సైట్‌ ఇంజినీర్‌ మర్డర్‌ మిస్టరీ వీడింది.. అంతా అనుకున్నట్లు హంతకుడు ఎవరో తేలిపోయింది..
Visakha Murder Mystery
Follow us on

విశాఖలో సైట్‌ ఇంజినీర్‌ రెడ్డి గోపాలకృష్ణ మర్డర్‌ మిస్టరీ వీడింది. నిందితుడు బ్రహ్మయ్యను అరెస్ట్‌ చేశారు పోలీసులు. రెండ్రోజుల క్రితం బీచ్‌రోడ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో గోపాలకృష్ణను హత్య చేశారు. మృతుడితో కలిసి మద్యం తాగిన బ్రహ్మయ్య.. గోపాలకృష్ణతో గొడవ పడ్డాడు. చిన్న గొడవ కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి గోపాలకృష్ణను కత్తితో పొడిచిన బ్రహ్మయ్య. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు గోపాలకృష్ణ. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

ఆ రోజు ఏం జరిగిదంటే…

రెండు రోజుల క్రితం విశాఖ బీచ్‌ రోడ్డులోని ప్రతిమ ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో మర్డర్ జరిగింది. రెడ్డి గోపాలకృష్ణ అనే సివిల్ ఇంజనీర్‌.. రోజు అతనితో ఉండే సన్నిహితుల సమక్షంలోనే హత్యకు గురికావడం కలకలం రేపింది. మర్డర్ జరిగిన స్పాట్ చూస్తే .. రాత్రి వరకు అందరూ మద్యం తాగి, హాయిగా భోజనాలు చేసినట్లు ఉంది. మరి హత్య ఎందుకు జరిగిందన్న దానిపైనే పోలీసులు ఆరా తీస్తున్నారు. రూమ్‌ నెంబర్ 404లో గోపాలకృష్ణతో పాటు త్రినాథ్‌, సాయి అనే మరో ఇద్దరు ఉంటున్నారు. వీళ్లతో పాటు బ్రహ్మయ్య అనే వ్యక్తి కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. రాత్రి బ్రహ్మయ్యే గోపాలకృష్ణని కత్తితో పొడిచాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఇదే కోణంలో పోలీసలు విచారణ మొదలు పెట్టారు. చివరికి హత్య చేసింది ఎవరో తేల్చారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన గోపాలకృష్ణ.. సైట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు త్రినాద్‌, సాయి అనే ఇద్దరు స్నేహితులు కలిసి ఒకే ప్లాట్‌లో ఉంటున్నారు. గోపాలకృష్ణను హత్య చేసిన బ్రహ్మయ్య మాత్రం వీళ్లకు అన్నం వండటం చేస్తుండేవాడని తెలుస్తోంది. సోమవారం రాత్రి అందరూ పీకలదాకా మద్యం తాగి.. భోజనం చేసిన తర్వాత గోపాలకృష్ణ ఓ రూంలోకి వెళ్లగా వెనుకే వెళ్లిన బ్రహ్మయ్య కత్తితో పొడిచాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించేలోపే గోపాలకృష్ణ మరణించాడు.

ఇవి కూడా చదవండి: Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..

G Kishan Reddy: అందుకే నాకు ప్రమోషన్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు