విజయవాడ : బాలిక మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్..

విజయవాడ భవానీపురం చిన్నారి మర్డర్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఊహించని విధంగా ఇంటి పక్కన  నివశించే ప్రకాశే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా బాలిక మెడపై గోళ్లతో రక్కిన గాట్లు ఉండటంతో..ప్రకాశ్ చిన్నారిపై అత్యాచారం చేసినట్టుగా వారు అనుమానిస్తున్నారు. కాగా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గతంలో కూడా ..మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో జైలుశిక్ష అనుభవించి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తాజా ఘటనలో పాపను హత్య చేసిన […]

విజయవాడ : బాలిక మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్..

విజయవాడ భవానీపురం చిన్నారి మర్డర్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఊహించని విధంగా ఇంటి పక్కన  నివశించే ప్రకాశే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా బాలిక మెడపై గోళ్లతో రక్కిన గాట్లు ఉండటంతో..ప్రకాశ్ చిన్నారిపై అత్యాచారం చేసినట్టుగా వారు అనుమానిస్తున్నారు.

కాగా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గతంలో కూడా ..మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో జైలుశిక్ష అనుభవించి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తాజా ఘటనలో పాపను హత్య చేసిన దుండగుడు..ఏం తెలియనట్టుగా పేరెంట్స్‌తో కలిసి..ఆమె కోసం వెతికినట్టుగా నటించడం గమనార్హం.

నిందితుడ్ని పట్టించిన భార్య:

రాత్రి సమయంలో నిందితుడు ప్రకాశ్‌కి, అతని భార్యకు డబ్బులు విషయంలో గొడవ జరిగింది. పనిచేసిన డబ్బులు కూడా తాగుడుకు వాడేస్తుండటంతో..మహిళ తన భర్తతో వాగ్వివాదానికి దిగింది. కోపంతో ఊగిపోయిన ప్రకాశ్..ఇంట్లో వస్తువులను చెల్లాచెదురుగా విసిరికొట్టాడు.  ఆ సమయంలో మిస్సైన ఏటీఎం కార్డు కోసం వెతుకుతుండగా.. తలుపు పక్కన ఓ మూట కనిపించింది. దీంతో అనుమానం వచ్చి విషయాన్ని నిందితుడి భార్య సునీత ఇరుగుపొరుగు వారికి చెప్పింది.  స్థానికులు నిందితుడికి దేహశుద్ది చేసి..పోలీసులకు అప్పగించారు. మెడపై గాయం ఉండడం.. ఏదైనా తీగను లేదా తాడును మెడకు చుట్టి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. కాగా దుండగుడిని చిన్నారి పెద్దనాన్న అని పిలిచేదిగా సమాచారం. చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం,  హత్యోదంతం మరవకముందే..మళ్లీ అటువంటి దుర్ఘటనే జరగటం బాధాకరం.