Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం.. 11 మంది దుర్మరణం..

Uttarakhand Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. డెహ్రాడూన్‌ జిల్లాలోని వికాస్‌నగర్‌ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో

Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం.. 11 మంది దుర్మరణం..
Uttarakhand Road Accident

Updated on: Oct 31, 2021 | 11:38 AM

Uttarakhand Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. డెహ్రాడూన్‌ జిల్లాలోని వికాస్‌నగర్‌ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వాహనంలో 16 మంది ఉన్నట్లు పేర్కొంటున్నారు. డెహ్రాడూన్‌ జిల్లాలోని చక్రతా ప్రాంతంలో బుల్హాద్-బైలా రోడ్డు గుండా వికాస్‌నగర్ వెళ్తున్న క్రమంలో యుటిలిటీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో మృతదేహాలన్నీ చెల్లచెదురుగా పడ్డాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్థులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఈ ఘటన ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read:

Hyderabad: నీలోఫర్‌ ఆసుపత్రిలో దారుణం.. రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్‌బాయ్‌..

Jammu and Kashmir: ఎల్ఓసీ వెంట పేలిన మందుపాతర.. ఇద్దరు జవాన్ల వీరమరణం..

Liquor Depot Accident: మద్యం డిపోలో అగ్ని ప్రమాదం.. అధికారుల లెక్కల్లో భారీ తేడా.. అసలు కథేంటంటున్న జనాలు..!