AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటకలిసిపోతుందనడానికి తాజాగా ఉత్తరప్రదేశ్‌ జరిగిన ఘటనే నిదర్శనంగా నిలుస్తుంది. భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ, తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో ప్రియుడితో కలిసి కన్నబిడ్డలనే కడతేర్చింది. ఈ అమానవీయ ఘటన శుక్రవారం రోడ్కలి గ్రామంలో వెలుగు చూసింది.

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!
Up Crime
Anand T
|

Updated on: Jun 20, 2025 | 10:51 PM

Share

ప్రియుడితో వెళ్లిపోయేందుకు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఓ మహిళ కన్న బిడ్డలనే కడతేర్చిన ఘటన శక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్థానిక పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్కాన్‌ అనే (24) ఏళ్ల మహిళకు వసీం అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లిద్దరికి ప్రస్తుతం అర్హాన్, ఇనాయా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త వసీం ఉద్యోగం నిమిత్తం చండీగఢ్‌లో ఉంటూ అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్తూ ఉంటాడు.

ఇక భార్త ఇంటి పాటున ఉండకపోవడంతో భార్య ముస్కాన్ జునైద్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇలా కొన్నేళ్ల పాటు వీరిద్దరూ మద్య ఈ సంబంధం కొనసాగుతూనే ఉంది. ఇలా కాదని ఇద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంబిద్దాం అనుకున్నారు. కానీ అందుకు పిల్లలు అడ్డుగా ఉండడంతో వాళ్లని అడ్డుతొలగించుకోవాలనుకున్న ముస్కాన్‌, ప్రియుడు జునైద్‌లో కలిసి ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసింది.

ఇక గురువారం ముస్కాన్ ఇంట్లో పిల్లలు అర్హాన్ (5), ఇనాయా (1) మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరు పిల్లల మృతిపై అనుమానం రావడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. పిల్లల మరణంలో తల్లి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ముస్కాన్‌ను వెతికి పట్టుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారనలో ముస్కాన్ నేరాన్ని అంగీకరిస్తూ.. ప్రియుడు జునైద్‌తో కొత్త జీవితం ప్రారంభించేందుకు తన ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉన్నారని.. అందుకే వాళ్లను చంపాలని నిర్ణయించుకొని.. అన్నంలో విషం కలిపి హత్య చేసినట్టు ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే పిల్లలను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి ముస్కాన్‌ హనీమూన్‌కు వెళ్లేందుకు ప్లాన్‌ కూడా వేసుకున్నట్లు పోలీసుల గుర్తించారు. అయితే ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముస్కాన్‌ను అరెస్ట్ చేయగా.. ఆమె ప్రియుడు జునైద్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us