US school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. యూఎస్ టెక్సాస్‌లోని ఓ పాఠశాలలోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టెక్సాస్ అర్లింగ్టన్లోని ఓ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ.. పాఠశాలలో జరిగిన కాల్పులకు అధికారులు స్పందించారన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలయ్యాయో ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. అధికారులు విచారణ జరుపుతున్నారని పోలీస్ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. కాల్పుల నేపథ్యంలో పాఠశాలల వెలుపల అంబులెన్స్‌లు, ఫైరింజన్లను మోహరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో కాల్పులు మోత ఆగడం లేదు. తాజా యూఎస్ టెక్సాస్ ఫరిధిలో కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ డల్లాస్ పరిధి అర్లింగ్టన్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఓ విద్యార్థి (18) అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు కాల్పులకు దిగడంతో అక్కడ ఉన్నవారంతా పారిపోతుండగా నలుగురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్లు పోలీసులు వెల్లడించారు.
సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. కాల్పులు జరిపిన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. టింబర్‌వ్యూ పాఠశాలలో మొత్తం 1,900 విద్యార్థులు చదువుతున్నారని.. కాల్పుల శబ్ధం వినిపించడంతో అందరు పరుగులు తీశారు. అయితే.. కాల్పుల విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకొని తమ పిల్లలను తీసుకెళ్లారు.
కాగా.. కాల్పులు జరిపిన విద్యార్థి తిమోతి జార్జ్ సింప్‌కిన్స్‌కు ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: