రూ.10 నోటుతో మాస్క్.. కేసు పెట్టిన పోలీసులు

లాక్‌డౌన్ టైంలో మాస్క్ లేకుండా ఎవరూ బయట కనిపించడం లేదు. ఒకవేళ మాస్క్ లేకుండా ఎవరు కనిపించినా వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్క్‌ లేని వారు కనీసం కర్ఛీఫ్ అయినా మూతికి..

రూ.10 నోటుతో మాస్క్.. కేసు పెట్టిన పోలీసులు

Edited By:

Updated on: May 19, 2020 | 2:16 PM

లాక్‌డౌన్ టైంలో మాస్క్ లేకుండా ఎవరూ బయట కనిపించడం లేదు. ఒకవేళ మాస్క్ లేకుండా ఎవరు కనిపించినా వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్క్‌ లేని వారు కనీసం కర్ఛీఫ్ అయినా మూతికి కట్టుకోవాలని పోలీసులూ, ప్రభుత్వాలూ చెబుతూనే ఉన్నాయి. అయినా అమీర్ అనే యువకుడు ఇది కేర్ చేయకుండా తన ఫ్రెండ్‌తో కలిసి మాస్క్ లేకుండా బయటికొచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. అమీర్ అనే వ్యక్తి కూలి డబ్బులు తీసుకోవడానికి.. వేరే ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. అయితే తనతో వచ్చిన స్నేహితుడు ఖర్చీఫ్‌ కట్టుకుని ఉన్నాడు. అమీర్ వద్ద ఖర్చీఫ్ కూడా లేకపోవడంతో.. ఏం చేయాలో తెలీక టక్కున జేబులో ఉన్న పది రూపాలయ నోటు తీసి మూతికి అంటించుకున్నాడు. ఇతని క్రియేటివిటీకి పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. అమీర్‌ని బైక్ నుంచి దింపి క్లాస్ పీకారు. దీంతో ‘అమీర్‌ మీకేం సార్ మీరు బాగానే చెప్తారు. మాస్క్ ఏమన్నా రూపాయి, అర్థరూపాయికి వస్తుందా? దాన్ని కొనాలంటే 40 రూపాయిలు కావాలి. నా దగ్గర ఈ పది రూపాయిలు మాత్రమే ఉన్నాయి. మేము మాస్క్ కూడా కొనుక్కోలేమని’.. తన బాధలు చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అతనికి నచ్చ జెప్పి, చెరో మాస్క్ ఇచ్చి పంపించారు. అయితే లాక్‌డౌన్ ఉల్లంఘన చేశారంటూ ఐపీసీ సెక్షన్ 188 కింద ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇది కూడా చదవండి: 

బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌