Crime News: అనుమానపు రాక్షసుడు.. భార్య పట్ల ఒళ్లు గగురుపరిచేలా ప్రవర్తించిన భర్త…

| Edited By: Team Veegam

Mar 23, 2021 | 11:54 AM

UP Crime News: కట్టుకున్నవాడే కిరాతకుడు అయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు...

Crime News: అనుమానపు రాక్షసుడు.. భార్య పట్ల ఒళ్లు గగురుపరిచేలా ప్రవర్తించిన భర్త...
Crime News
Follow us on

UP Crime News: కట్టుకున్నవాడే కిరాతకుడు అయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. విచక్షణారహితంగా దాడి చేసి ఆమె జననాంగాన్ని అల్యూమినియం వైర్లతో కుట్టేశాడు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

పశ్చిమ యూపీ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరగగా.. బాధితురాలిని ఆమె తల్లి, మరో మహిళ కలిసి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. సదరు మహిళపై దాడి చేసిన తర్వాత ఆ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమె సమీప గ్రామంలో నివసించే తన తల్లికి సమాచారం అందించడంతో.. ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వారు ఘటనాస్థలానికి చేరుకొని మహిళను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దుర్మార్గపు భర్తను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

”తన భార్య గ్రామంలోని మిగతా వ్యక్తులతో తరచూ మాట్లాడటమే కాకుండా అక్రమ సంబంధం పెట్టుకుంది. అది సరైనది కాదని చెప్పినా, ఆమె వినలేదు. దానితో కోపం వచ్చి ఆమె జననాంగాన్ని అల్యూమినియం వైర్లతో కుట్టేసినట్లుగా ”ఆమె భర్త పోలీస్ కస్టడీలో పేర్కొన్నాడు. కాగా, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని పోలీసులు అన్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…