Ashu Jaat arrested: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఊరు నుంచి మకాం మార్చాడు. అలాగే గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషం మార్చాడు. అయితే పాత స్నేహితుల కారణంగా పట్టుబడి, జైలు పాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఆషు జాత్ అనే వ్యక్తి హత్యలు, కిడ్నాప్‌లు దోపీడీలు చేశాడు. ఈ క్రమంలో ఇతడిపై మొత్తం 51 కేసులు ఉన్నాయి. ఇక నోయిడాకు చెందిన ప్రముఖులు గౌరవ్, హపుర్, బీజేపీ నాయకుడు రాకేష్ శర్మలను హత్య చేసిన ఆషు.. ఆ తరువాత ముంబయికి వెళ్లాడు. అక్కడ వేషం మార్చి పండ్లు అమ్ముకునే వాడిలా అవతారం ఎత్తాడు. ఇక అతడి కోసం వెతుకుతున్న పోలీసులకు ఆషు ముంబయిలో ఉన్నట్లు సమాచారం అందింది. కానీ వేషం మార్చడం వలన అంత ఈజీగా గుర్తుపట్టలేకపోయారు. అయితే పాత స్నేహితులతో సంబంధాలను మాత్రం వదులుకోలేదు. ఈ క్రమంలో అతడి సహచరుడి ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు, మొత్తానికి క్రిమినల్ జాడను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ముంబయికి వెళ్లి శనివారం అతడిని అరెస్ట్ చేశారు.
Read More: