Hyderabad: పాతబస్తీలో దారుణం.. ఆటో విషయంలో చెలరేగిన వివాదం.. ఇద్దరు సోదరులపై హత్యాయత్నం..

Hyderabad: హైదరాబాద్‌ పాత బస్తీలో మంగళవారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. చిన్న అంశంపై చెలరేగిన వివాదం ఏకంగా ఇద్దరి వ్యక్తులపై కత్తులతో దాడి చేసే స్థాయికి చేరింది. వివరాల్లోకి వెళితే..

Hyderabad: పాతబస్తీలో దారుణం.. ఆటో విషయంలో చెలరేగిన వివాదం.. ఇద్దరు సోదరులపై హత్యాయత్నం..
Old City

Edited By:

Updated on: Jul 20, 2022 | 6:14 AM

Hyderabad: హైదరాబాద్‌ పాత బస్తీలో మంగళవారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. చిన్న అంశంపై చెలరేగిన వివాదం ఏకంగా ఇద్దరి వ్యక్తులపై కత్తులతో దాడి చేసే స్థాయికి చేరింది. వివరాల్లోకి వెళితే.. మహ్మద్‌ అజర్‌ అనే వ్యక్తి చాంద్రయాన్‌ గుట్ట పాత పోలీస్‌ స్టేషన్‌లో వెనకాల ఉన్న ఓ గల్లీలో గదిని అద్దెకు తీసుకొని ఓ గోదామ్‌ను నిర్వహిస్తున్నారు. గోదామ్‌కు సామాన్లను చేరవేయడానికి ఆటో వస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అదే కాలనీకి చెందిన వాహేద్‌ (35) అనే వ్యక్తి ఆటో గల్లీలోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో అజర్‌ ఇద్దరు కుమారులు మహ్మద్‌ గులామ్‌ అక్బర్‌, మహ్మద్‌ గులాగ్‌ అస్‌ఘర్‌లతో (కవలలు) మరోసారి వాగ్వాదానికి దిగాడు. తన ఇంటి ముందు నుంచి ఆటో ఎలా వెళుతుందంటూ ఇద్దరు సోదరులతో వాగ్వాదానికి దిగాడు. ఆటో కారణంగా రోడ్‌ బ్లాక్‌ అవుతుందంటూ వాహేద్‌ దుర్భాషలాడాడు. దీంతో సరిగ్గా మాట్లాడొచ్చు కదా అని వాహేద్‌ను ట్విన్స్‌ బ్రదర్స్‌ వారించారు. దీంతో కోపంగా ఇంట్లోకి వెళ్లిన వాహేద్‌ కత్తి తీసుకొచ్చి ఇద్దరు సోదరులపై కత్తితో దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కవలలైన మహ్మద్‌ గులామ్‌ అక్బర్‌, మహ్మద్‌ గులామ్‌ అస్‌గఘర్‌ సంతోష్‌ నగర్‌లో డిగ్రీ చదువుతున్నారు. ఇక కత్తితో దాడి చేసిన వాహేద్‌ ఇటీవలే విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..