Jammu Kashmir: ఎన్‌కౌంటర్ అనంతరం ఇద్దరు ఉగ్రవాదుల లొంగుబాటు.. రెండు ఏకే-47 రైఫిల్స్‌ స్వాధీనం

|

Jan 30, 2021 | 12:57 PM

మ్మూకాశ్మీర్‌ పుల్వామాలోని అవంతిపోరాలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు...

Jammu Kashmir: ఎన్‌కౌంటర్ అనంతరం ఇద్దరు ఉగ్రవాదుల లొంగుబాటు.. రెండు ఏకే-47 రైఫిల్స్‌ స్వాధీనం
Follow us on

Terrorists Surrender: జమ్మూకాశ్మీర్‌ పుల్వామాలోని అవంతిపోరాలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఘటన అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు లొంగిపోయారు. ఈ మేరకు జమ్ము కాశ్మీర్ పోలీసులు శనివారం ఉదయం ట్విట్ చేశారు. పుల్వామా జిల్లాల్లోని జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు ఏకే-47 రైఫిల్స్‌తో పోలీసు, భద్రతా దళాల సీనియర్‌ అధికారుల ముందు లెల్హార్ ప్రాంతంలో లొంగిపోయారని పోలీసులు ట్వీట్‌ చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఒక ఉగ్రవాదిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా శుక్రవారం రాత్రి 8 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. లొంగిపోయిన ఇద్దరూ ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఈ ప్రాంతంలో భద్రతా దళలా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Also Read:

Jammu And Kashmir: జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌… భ‌ద్ర‌తా ద‌ళాల చేతిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం…

High Alert: ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఐఎస్ఎఫ్.. దేశవ్యాప్తంగా ఉన్న..