ప్రకాశం జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు విద్యార్థుల మృతి..

Prakasam dist: ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను తీసింది. ఈత కోసం బావిలోకి దిగిన ఇద్దరు కూడా నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పామూరు

ప్రకాశం జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు విద్యార్థుల మృతి..
drowning

Updated on: Mar 12, 2021 | 10:11 PM

Prakasam dist: ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను తీసింది. ఈత కోసం బావిలోకి దిగిన ఇద్దరు కూడా నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్ల గూడూరులో చోటుచేసుకుంది. బొట్లగూడూరు గ్రామానికి చెందిన శశి కుమార్ (15) సంతోష్‌ (20) ఇద్దరూ కూడా శుక్రవారం ఈత కొట్టేందుకు గ్రామం సమీపంలోని ఊట బావి దగ్గరకు వెళ్లారు. అనంతరం ఇద్దరూ కూడా స్నానానికి బావిలో దిగారు. ఒకరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన మరొకరు కూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో ఇద్దరు విద్యార్థులు కూడా చనిపోయారు.

సమాచారం అందుకున్న గ్రామస్థులు బావి దగ్గరకు వెళ్లి శశికుమార్‌, సంతోష్ మృతదేహాలను బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈడుకొచ్చిన ఇద్దరు యువకులు చనిపోవడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

Also Read:

Husband Commits Suicide : హైదరాబాద్‌లో విషాద ఘటన.. భార్యను చంపి భర్త ఆత్మహత్య.. కారణాలు ఇలా ఉన్నాయి..

Petrol Stolen: మండుతున్న చమురు ధరలు.. వారి ఆశే వీరి ఆసరా.. హైదరాబాద్ శివారులో రెచ్చిపోయిన పెట్రోల్ దొంగలు..